Coronavirus: 3rd case reporter in mancherial కరోనా వైరస్ అలర్ట్: మంచిర్యాలలో మరో కేసు

Telangana one more patient tests positive for coronavirus from mancherial

Coronavirus outbreak, Telangana high alert, telangana corona outbreak, another coronavirus suspected case in mancherial, itally returned person with corona symptoms, coronavirus, coronavirus status in telangana, coronavirus in hyderabad, Health administration, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, Coronavirus, covid-19, foreigners quarantine, vikarabad tourism resort isolation ward, mohammad hussian siddiqui, Gulburga hospital staff, Telangana

A patient with a travel history to Italy has been suspected to be positive for COVID-19, from Manchirial of Telangana. After Treatment in Manchirial area hospital he had been shifted to Gandhi Hospital for Treatment. For further confirmation, the authorities have sent their samples to National Institute of Virology (NIV), Pune.

కరోనా వైరస్: మంచిర్యాలలో మరో కేసు నమోదు.. గాంధీకి తరలింపు

Posted: 03/14/2020 05:08 PM IST
Telangana one more patient tests positive for coronavirus from mancherial

తెలంగాణలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోందా.? అంటే ఔనని చెప్పకతప్పదు. తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసులో దుబాయ్ నుంచి వచ్చిన బెంగళూరు టెక్కీ.. గాంధీలో చికిత్స పోంది పూర్తిగా కోలుకున్న తరువాత.. అతడ్ని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోనే మరో కరోనా కేసు నమోదైనట్లు సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇక రెండో కేసుతో పాటు ఇటలీ నుంచి వచ్చిన మరో ఇద్దరి విషయంలోనూ అనుమానాలు వున్నాయని.. వారిని కూడా క్వారంటైన్ చేస్తున్నారని తెలిపారు. వీరి విషయంలో మరింత సమాచారం వారి వైద్య నివేదికలు వచ్చిన తరువాతే స్పష్టమవుతుందని అన్నారు.

ఇలా ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మరో వ్యక్తిలోనూ కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతడ్ని గాంధీ అసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దాదాపు 12 రోజుల ముందు మంచిర్యాలకు చెందిన వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. అతడికి ఎలాంటి పరీక్షలు చేయకుండా వదిలేయడంతో నేరుగా తన స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే గత వారం రోజులుగా దగ్గు, జలుబుతో బాదపడుతున్న ఆయనను అక్కడి ఏరియా అస్పత్రిలో చికిత్స అందించారు.

దీంతో జ్వరం కూడా రావడంతో కరోనా వైరస్ లక్షణాలుగా గుర్తించిన వైద్యులు.. సదరు రోగిని గాంధీ అసుపత్రికి చికిత్ప నిమిత్తం పంపించారు. ఇక అడ్మిట్ చేసిన వైద్యులు అతడ్ని పరీక్షలు నిర్వహించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపారు. నివేదికలపై ఆధారపడి అతడికి చికిత్సలను చేయనున్నారు. కాగా దుబాయ్ నుంచి సికింద్రాబాద్ వయా బెంగళూరుకు వచ్చిన యువకుడు కరోనా వ్యాధి నుంచి విముక్తి పోందాడు. కాగా ఒకరు చికిత్స విజయవంతం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న అధికారులకు మరిన్ని అనుమానిత కేసులు పెరగడం కూడా కలవరానికి గురిచేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles