corona bandh: malls, theaters, schools shut down in Telangana కరోనా అలర్ట్: అర్థరాత్రి నుంచి మాల్స్, థియేటర్లు బంద్

Coronavirus schools colleges malls theatres to be closed in telangana until 31 march

educational institutions, schools, malls, shopping centers, movie theatres, Telangana government, CM KCR, coronavirus scare, covid-19 scare, coronavirus rumours, coronavirus, COVID-19, Coronavirus, covid-19, mohammad Hussain siddiqui, Fever, Gulburga hospital staff, corporate hospital, Telangana, politics

All educational institutions, shopping malls, cinema halls and public gathering places in Telangana would be closed down from Saturday night up to March 31 in the light of coronavirus.

కరోనా అలర్ట్: అర్థరాత్రి నుంచి మాల్స్, థియేటర్లు బంద్

Posted: 03/14/2020 06:01 PM IST
Coronavirus schools colleges malls theatres to be closed in telangana until 31 march

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక దేశాల్లో విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో వ్యాధి ఇతరులకు సోకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో థియేటర్లు, స్కూళ్లు మూసివేయాలని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం కేబినేట్ సమావేశం జరిగాక ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. ఈ నెలాఖరు వరకూ ఈ బంద్ వర్తించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు మాత్రం యథాతథంగా జరగనున్నాయి. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి.

కొవిడ్‌ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం అసెంబ్లీ హాలులో భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

సినిమా థియేటర్లు, స్కూళ్లను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నారు. అలాగే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను సైతం కుదించనున్నారు. వాస్తవానికి ఈ నెల 20 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆది, సోమవారాలు సమావేశాలు నిర్వహించి.. ఆఖరి రోజైన సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles