YCP Attacking On Democracy in State: BJP రాష్ట్రంలో కబ్జాల పర్వం.. బీజేపి రాష్ట్రాద్యక్షుడి భూమే కబ్జా..

Kanna laxminarayana alleges encrochers at spree in state

BJP chief Kanna Lakshminarayana land encroched, visakhapatnam executive capital, vizag land encrochments, police official land encroched in vizag, chepaluppalapadu land, Andhra Pradesh, Politics

Andhra Pradesh BJP chief Kanna Lakshminarayana alleges encrochers at spree in State Executive Capital Area after the announcement. He says that his land was encroached in vizag by encrochers. A land beside to the BJP party office in vizag was encroched at gun point.

రాష్ట్రంలో కబ్జాల పర్వం.. బీజేపి రాష్ట్రాద్యక్షుడి భూమే కబ్జా..

Posted: 03/14/2020 04:19 PM IST
Kanna laxminarayana alleges encrochers at spree in state

రాజధాని అమరావతిని శాసన రాజధానిగా మారుస్తూ.. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన వెంటనే ఇక్కడ భూఅక్రమార్కులు రెక్కలు కట్టుకుని వాలిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్న వత్యాసం లేకుండా ఎవరి భూమి పడితేవారి భూమిని అక్రమార్కులు తమ కబంధహస్తాల్లోకి తీసుకుంటున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. విశాఖపట్నంలో లేని సంస్కృతికి అక్రమార్కులు అపాదిస్తున్నారని మండిపడ్డారు.

విశాఖలో గత రెండు మూడు నెలలుగా అనేక భూ కబ్జాలు వెలుగుచూశాయని పేర్కోన్న ఆయన తమ పార్టీ కార్యాలయానికి ఆనుకుని వున్న భూమిని కూడా అక్రమార్కులు గన్ పాయింట్ లో తుపాకులు పెట్టి బెదిరించి మరీ కబ్జాచేశారని అరోపించారు. అంతేకాదు తనకు చెందిన సొంతభూమిని కూడా అక్రమార్కులు కబ్జాచేశారని ఆయన తెలిపారు. తన మనుషులను పంపితే అప్పటికే కంచె వేసిన అక్రమార్కులు.. ఈ భూమి బీజేపి అధ్యక్షుడిదని తెలియదని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని తన భూమి పక్కనే భూమి వున్న ఓ పోలీసు అధికారి చెబితే కానీ తనకు తెలియదని చెప్పుకోచ్చారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పాడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని ఆరోపించారు. తుపాకీ గురిపెట్టి మరీ సెటిల్ మెంట్లు చేస్తున్నారని లక్ష్మీనారాయణ మండిపడ్డారు. భీమిలి సమీపంలో స్వయంగా తాను 1993లో చేపలుప్పాడలో తాను స్థలం కొనుగోలు చేశానని, పక్కనే ఓ పోలీసు అధికారి కూడా స్థలం కొనుగోలు చేశారని చెప్పారు. అయితే ఓ రోజు ఆ పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి.. తమ ఇద్దరి భూములు కబ్జా చేశారని చెప్పినట్లు వివరించారు.

దీంతో వెంటనే తన మనుషులను పంపించి తన భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించారని గుర్తు చేసుకున్నారు. అదేంటని అడిగితే ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అని అనుకోలేదని కబ్జాదారులు చెప్పారని వ్యాఖ్యానించారు. తన మాదిరిగానే విశాఖలో భూ మాఫియాకు వందలాది మంది బాధితులయ్యారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాక అక్కడి ప్రజలే కాక, చుట్టుపక్క జిల్లాల ప్రజలు కూడా భయపడుతున్నారని చెప్పారు. ఓ వైపు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం..

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోనూ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడం.. వేసినవారి ఇళ్లల్లో అక్రమంగా మద్యం సీసాలు పెట్టించి అక్రమంగా కేసులు బనాయించడం.. నామినేషన్ వెసేందుకు వెళితే అధికారులను అడ్డుపెట్టుకుని నామినేషన్ పత్రాలను లాక్కుని వెళ్లడం.. లేదా నామినేషన్ దాఖలు చేయకుండా అధికారులతో వేధించడం వంటి చర్యలను అధికార ప్రభుత్వం  ప్రోత్సహిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని తాను కేంద్రాన్ని కోరుతానని కన్నా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles