Petrol, diesel prices drop as crude prices plunge భారత్ లో నామమాత్రం తగ్గిన ఇంధన ధరలు..

Fall in oil prices opens window for government to raise taxes

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price, Petrol prices, VAT, Diesel price, fuel retailers, global crude oil prices, Oil price, diesel, Petrol

The sharp decline in global crude oil prices opens a window of opportunity for Prime Minister Narendra Modi’s government to increase excise duties on petrol and diesel to boost its revenues, at a time it is struggling to garner resources amid an economic slowdown.

అక్కడ రికార్డుస్థాయి.. ఇక్కడ నామమాత్రం తగ్గిన ఇంధన ధరలు..

Posted: 03/10/2020 11:59 AM IST
Fall in oil prices opens window for government to raise taxes

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన ప్రతీసారి ఎలాంటి సంకోచం లేకుండా ఉన్నపళంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే కేంద్రప్రభుత్వం.. ఆదే ధరలు తగ్గిన సమయాల్లో మాత్రం ఆ ఫలాలను ప్రజలకు అందించడంలో కొత్త పద్దతులను అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన క్రమంలో వాటి భారాన్ని వాహనదారులపై మోపే ప్రభుత్వం.. అదే ధరలు తగ్గిన సమయంలో ప్రజలకు వాటి లాభాలను అందించకుండా ఎక్సైజ్ డ్యూటీ చార్జీలను పెంచుతూ అదాయావనురుగా మార్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ పై ఆదారపడి భారత్ దేశంలో ఇంధన దరలు వుంటాయన్న మాటలు నీటిమూటలుగా మారుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా.. ధరల తగ్గింపు లాభాలను మాత్రం వాహనదారులు చూడటం లేదు. 2010 జూన్ మాసంలో అప్పటివరకు రెండు మాసాలకో పర్యాయం ఇంధన ధరలపై అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధన ధరల పెంపు నిర్ణయాలు వుండేవి. కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని తొలుత పక్షం రోజులో పర్యాయంగా మార్చి.. ఆనక రోజువారీగా ధరల మార్పులు చేర్పులు వుంటాయని తెలిపింది.

ఈ కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని వస్తువులు, సేవలకు పన్నులను జీఎస్టీగా మార్చి ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినా.. ఇంధనంపై మాత్రం ధనార్జన.. వనరుగా చూస్తూ.. ఎక్కడా కనిపించిన వ్యాట్ పద్దతినే ఎంచుతున్నారు. ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు తాము సమ్మతేమేనని.. అయితే రాష్ట్రాలు మాత్రం అందుకు వ్యతిరేకిస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబడుతోంది కేంద్రం. దీంతో వ్యాట్ మూలంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఇంధన ధరలు వున్నాయి. ఒకే దేశం.. ఒకే పరీక్ష, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ అన్నింటిలోనూ ఏకత్వాన్ని తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకున్న కేంద్రం.. ఇంధనం విషయంలో మాత్రం ఒకే దేశం ఒకే ఇంధన ధర అన్న సూక్తికి తూట్లు పోడుస్తోంది.

తాజాగా కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఏకంగా ఇరవై ఏళ్ల నాటి కనిష్టానికి చేరుకున్నాయి. దీనికి తోడు ఇరాన్.. రష్యాల మధ్య కూడా వివాదాల నేపథ్యంలో మరింతగా ఇంధన ధరలు తగ్గుతున్నాయి. ఏకంగా 1998నాటి స్థాయికి ఇంధన ధరలు దిగజారాయి. అయితే దేశీయ వాహనదారులకు మాత్రం ఇంధన ధరల తగ్గింపు నామమాత్రమే. వివిధ నగరాల్లో పెట్రోల్‌ పై 24 నుంచి 27 పైసలు, డీజిల్‌ పై 25 నుంచి 26 పైసల మేర ధర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తెలిపాయి. దీంతో ఎనిమిది నెలల కనిష్ఠానికి పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఈ ధరలు సమీప భవిష్యత్తులో మరింతగా తగ్గుతాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol prices  VAT  Diesel price  fuel retailers  global crude oil prices  Oil price  diesel  Petrol  

Other Articles