Jyotiraditya Scindia resigns from Congress ప్రధాని, అమిత్ షాలను కలిసిన సింధియా.. కాంగ్రెస్ కు రాజీనామా

Mp political crisis jyotiraditya scindia quits congress after meeting pm amit shah

Jyotiraditya Scindia resigns congress, Congress, Sonia Gandhi, Rahul Gandhi, PM Narendra Modi, Amit Shah, JP Nadda, Kamal Nath, Jyotiraditya Scindia, Digvijay singh, cabinet ministers, Shivraj singh chouhan, BJP, defamation, Madhya Pradesh, Politics

Jyotiraditya Scindia resigned from the primary membership of the Congress, hours after he met Prime Minister Narendra Modi along with Home Minister Amit Shah. Scindia has sent his resignation letter to Congress interim president Sonia Gandhi.

‘చే’జారుతున్న మధ్యప్రదేశ్.. కాంగ్రెస్ కు సింధియా రాజీనామా

Posted: 03/10/2020 12:52 PM IST
Mp political crisis jyotiraditya scindia quits congress after meeting pm amit shah

మధ్యప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి కమల్ నాథ్ సర్కారు పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ ముందునుంచి ఊహిస్తున్నట్లుగానే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత.. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఆపైన తన రాజీనామా లేఖను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు సింధియా. ప్రధాని మోడీ, అమిషాలతో భేటీ అయిన తరువాత ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ పరిణమాలు చకచకా జరిగిపోయాయి.

కాగా తాను గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేశానని పేర్కోన్నారు సింధియా. ఇప్పుడు మరో దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని... తాను ఈ దిశగా ఏడాది క్రితం నుంచే ఆలోచిస్తున్నాననే విషయం మీకు తెలుసని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యం తనకు ముందు నుంచి ఉందని... అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన లక్ష్యాన్ని తాను సాధించలేనని చెప్పారు. కాగా కాసేపట్లో ఆయన ప్రధాని, అమిత్ షా సమక్షంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఆధ్వర్యంలో బీజేపిలో చేరనున్నారని సమాచారం.

సరిగ్గా రాజ్యసభ ఎన్నికల సమయంలో అదనుచూసుకుని జ్యోతిరాధిత్య సింధియా వెన్నుపోటు అస్త్రాన్ని విసిరారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా వాద్ర గాంధీని రాజ్యసభకు పంపాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలపై ఆయన నీళ్లు చల్లారు. అయితే తన మద్దతుదారులు, ప్రజల అకాంక్షల కోసం.. వాటిని నెరవేర్చేందుకు తాను కొత్త ప్రారంభాన్ని చేస్తున్నానని సింధియా చెప్పుకోచ్చారు. ఇక తన వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులను ముందస్తుగానే బెంగళూరుకు తరలించిన సింధియా.. క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు.. బీజేపి అగ్రనేతలను కలుస్తూ గత వారం రోజులుగా బిజీగా మారారు.

ఎట్టకేలకు ఇవాళ అధినేత్రి సోనియాను కలిపి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై వివరించేందకు వెళ్లినా.. అందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి  అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో హస్తినలోనే వున్న సింధియా.. నేరుగా అమిత్ షా వద్దకు వెళ్లి కలిసారు. అక్కడి నుంచి ఇద్దరు కలసి ప్రధాని నరేంద్రమోడీని కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఏర్పడే బీజేపి ప్రభుత్వంలో తమవారికి మంత్రి పదవుల అంశాలతో పాటు తనకు రాజ్యసభ.. కేంద్రక్యాబినెట్ బర్త్ కన్పాఫ్ చేయడంతో పాటు పలు డిమాండ్లను ప్రధాని సహా అమిత్ షా నుంచి హామిలు పోందారు. ఆ తరువాత సింధియా తన పదవికి రాజీనామా చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles