Bootleg booze touted as 'corona cure' kills dozens in Iran 27 మంది ఉసురు తీసిన తప్పుడు ప్రచారం.. ‘స్పిరిట్’ తాగి

27 killed by alcohol poisoning in iran trying to protect themselves from coronavirus

alcohol, warm water, Coronavirus, covid-19, Coronavirus outbreak, Iran, Bootleg alcohol, Iran bootleg alcohol, Epidermic, rumors on corona, world health organisation, alcohol, warm water, Coronavirus iran, Coronavirus cases,coronavirus latest, Coronavirus latest updates, Coronavirus Case, remedy for Coronavirus, covid-19, Health

At least 27 people have died from alcohol poisoning in the Khuzestan and Alborz provinces of Iran trying to prevent infection of the coronavirus, Iranian news agencies reported

కరోనా కాటు తప్పించుకోబోయి.. స్పిరిట్ తాగి 27మందిని మృతి

Posted: 03/10/2020 11:14 AM IST
27 killed by alcohol poisoning in iran trying to protect themselves from coronavirus

మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరినో భయాందోళనకు గురిచేస్తోంది. ఏ ఒక్కరికి సోకినా.. ఇక తామే ఆ తరువాయి అన్న రీతిలో ప్రజలను అప్రమత్తం చేసే సోషల్ మీడియా సందేశాలు మరో ఎత్తు. ఈ నేపథ్యంలో ఓ మతపెద్ద చేసిన తప్పుడు ప్రచారం.. సోషల్ మీడియా తప్పుడు ప్రచారం వెరసి.. కరోనా లక్షణాలు లేకున్నా.. ముందస్తు నివారణ చర్యల్లో భాగమంటూ చికిత్సకు వెళ్లిన 27 మంది ప్రాణాలను బలియ్యాయి. ఎందుకంటే వారు ఆచరించిన ముందస్తు చికిత్స విధానం.. నాటు సారా.. మరో విధంగా చెప్పాలంటే స్పిరిట్.

మద్యంతో కరోనా వైరస్ నివారించవచ్చునన్న ప్రచారంతో ఇరాన్ లో 27 మంది ప్రాణాలు అనంతవాయువులలో కలిశాయి. మరో 218 మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కొందరు కంటిచూపును కోల్పోయారు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం మూలంగానే అంటే ఆశ్చర్యం కలగక మానదు. చైనా తర్వాత కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇరాన్‌ ఒకటి. ఆ దేశంలో ఇప్పటివరకు 7 వేలమందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. ఇక క్రితం రోజునే ఏకంగా 43 మంది కరోనా వ్యాధిభారిన పడి మరణించారు. మృతుల మరణాలు అక్కడి స్థానికులను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో నాటుసారా ప్రభావవంతంగా పనిచేస్తుందన్న వదంతులు అక్కడి వాళ్లు ప్రచారం చేశారు. అయితే ఇది సత్యదూరం అని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇక ఇరాన్ లో ముస్లింలు మద్యం సేవించరాని నిషేధాజ్ఞలు వున్నాయి. కేవలం ముస్లిమేతరులు మాత్రమే మద్యం సేవించేందుకు అనుమతి వుంది. దీంతో భావించిన ప్రభుత్వం.. అల్కోహాల్ పై నిషేధం విధించింది. అయినా సరే ప్రాణాంతక వ్యాధి నుంచి తమను రక్షించుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా స్థానిక ఫ్యాక్టరీలకు సప్లై చేసే స్పిరిట్ (బూట్ లెగ్ లిక్కర్)ను తీసుకోచ్చిన స్థానికులు దానిని సేవించారు.

నిత్యం తమకు ఇది అందుబాటులో వుండదని భావించిన స్థానికులతో పాటు కరోనా వ్యాధి సోకిందని అనుమానాలు వున్న మరికొందరి నివారణ పేరుతో కొందరు.. నయం చేస్తోందన్న భావనతో కోందరు అధికమొత్తంలో నాటుసారాను సేవించారు. కొన్ని గంటలవ్యవధిలో వారంతా అస్వస్థతకు గురయ్యారు. వారిలో 27 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 20 మంది ఖుజెస్థాన్‌ ప్రావిన్సుకు చెందినవారని, ఏడుగురు అల్బోర్జ్‌ ప్రాంతవాసులని అధికార వర్గాలు వెల్లడించాయి. నాటుసారాలో మెథనాల్‌ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధికంగా తీసుకుంటే వ్యక్తులు కంటి చూపు కోల్పోతారు. కాలేయం దెబ్బతింటుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంటుంది.

ఇక అటు ఇజ్రాయెల్ లో కూడా ఇదే తరహా తప్పుడు ప్రచారాలు జోరందుకున్నాయి. ఇక్కడ కొందరు మతపెద్దలే ఈ తరహా ప్రచారాలు చేయడం గమనార్హం. మతపెద్దలు ప్రజలకు చేస్తున్న సూచనలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ‘‘ప్రార్థన చేయడంతోపాటు మద్యం సేవిస్తే మన ప్రార్థనలు మరింత పరిపుష్ఠమవుతాయి. అప్పుడు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు’’ అని చెప్తూ ఓ మత గురువు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్‌ చేశారు. మెక్సికోకు చెందిన కరోనా కంపెనీ ఉత్పత్తి చేసే బీరు తాగాలని కూడా ఆయన సూచించారు. అపోహలను వ్యాపింపజేయడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles