మధ్యప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి కమల్ నాథ్ సర్కారు సంక్షోభంలో చిక్కుకోవడంతో హుటాహుటిని హస్తిన నుంచి మధ్యప్రదేశ్ కు చేరుకున్న ఆయన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. నిన్న రాత్రి ఆఘమేఘాల మీద కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో కలసి భేటీ ఆయని ఆయన.. ఆ వెంటనే క్యాబినెట్ భేటీకి అందుబాటులో వున్న మంత్రులతో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సింధియా వర్గంలోని అసంతృప్తి ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల గాలం వేసేందుకు వీలుగా తన క్యాబినెట్ మంత్రుల నుంచి రాజీనామాలు చేయించారు. దీంతో క్యాబినెట్ భేటీలో పాల్గోన్న 22 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.
ఉపముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు వర్గానికి చెందిన 6 మంది మంత్రులతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడేందుకు బెంగుళూరుకు తరలించారని సమాచారం. ఈ నేపథ్యంలో సింధియా క్యాంపులోని ఎమ్మెల్యేలను బయటకు రప్పించేందుకు.. అసంతృప్తి గళం వినిపిస్తున్న వారికి మంత్రి పదవులను కట్టబెట్టేందుకు ఈ పరిణామాలకు కమల్ నాథ్ శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సింధియా బీజేపి అగ్రనేతలను కూడా కలిసారని సమాచారం. తన వర్గంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు వున్నారని వారందరి మద్దతును కూడా అందిస్తానని బీజేపి హోం శాఖ మంత్రి అమిత్ షాతో చెప్పారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక ఈ పరిణామాల నేథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే మధ్యప్రదేశ్ పరిణామాలపై ఆయన ఇప్పటికే సోనియా గాంధీ వద్దకు వెళ్లి చర్చించారని తెలుస్తోంది. రాహుల్ గాంధీకి జ్యోతిరాధిత్య సింధియా అప్తమిత్రుడిగా కోనసాగుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ పరిణామాలపై గుణ పార్లమెంటు నియోజకవర్గం మాజీ సభ్యుడైన సింధియాతో చర్చించాలని అదేశించారని తెలుస్తోంది. అయితే సింధియా కేంద్రమంత్రి పదవిని ఆశించి ఈ ఫిరాయింపులకు పా్లపడుతున్నారా.? లేక కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారా.. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది.
రాజ్యసభ ఎంపీ పదవిపైనే సింధియా గురి.?
కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాథిత్య సింధియా.. బీజేపి గాలానికి చిక్కి.. పార్టీ ఫిరాయింపులకు తెరలేపారన్న అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ ముందుగా తన గళాన్ని సమర్థవంతంగా వినిపించేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పంపాలని నిర్ణయానికి వచ్చింది. సరిగ్గా ఎన్నికల తరుణంలో జ్యోతిరాధిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో ఫిరాయింపులకు పాల్పడటంతో.. ఆయన బీజేపి డైరెక్షన్ లోనే ఈ చర్యలకు పాల్పడ్డారా అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపకుండా నిలువరించేందుకే సరిగ్గా ఈ సమయంలో సింధియా ఫిరాయింపులకు తెరలేపారని కూడా జోరుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more