Sonia Gandhi refuses to meet Jyotiraditya Scindia కమల్ నాథ్ కు షాకిచ్చి.. సోనియా వద్దకు సింధియా..

Sonia gandhi s snub preceded jyotiraditya scindia s mp mlas flying to bengaluru

Congress, Kamal Nath, Jyotiraditya Scindia, Digvijay singh, Shivraj singh chouhan, BJP, defamation, Madhya Pradesh, Politics

Amidst speculation of Jyotiraditya Scindia leading the Madhya Pradesh Congress rift, sources have now revealed that the situation escalated to a point where 18 Congress MLAs are now in Bengaluru only after Congress interim chief Sonia Gandhi allegedly 'refused' to meet the former Guna MP.

కమల్ నాథ్ కు షాకిచ్చి.. సోనియా వద్దకు సింధియా..

Posted: 03/10/2020 09:34 AM IST
Sonia gandhi s snub preceded jyotiraditya scindia s mp mlas flying to bengaluru

మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ సర్కారు సంక్షోభంలో చిక్కుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్ నాథ్ ప్రభుత్వానికి భారీ షాకిచ్చారు. ఆయనకు మద్దతు ఇస్తున్న ఆరుగురు మంత్రులతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోయారు. వీరందరి ఫోన్లూ స్విచ్చాఫ్ లో ఉండటంతో కర్ణాటక తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపి బాహాటంగా ఎమ్మెల్యేలకు తాయిలాలను ముట్టజెప్పి.. అపరేషన్ అకర్ష్ కు తెరలేపిందన్న అరోపణలు గుప్పుమంటున్నాయి.

అచూకీలేకుండా పోయిన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ బెంగళూరులో మకాం వేసినట్టు వార్తలు వినబడుతున్నాయి. తాజా పరిస్థితితో దేశరాజకీయాల్లో మరోమారు వేడి పుట్టింది. సంక్షోభంలో పడిన సర్కారును కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇదే క్రమంలో జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు వచ్చారు. అయితే అమె మాత్రం సింధియాను కలవకూడదనే నిర్ణయించుకుని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్ష్ోభం నేపథ్యంలో సోనియాను కలసి అన్ని విషయాలు వివరించాలని అనుకున్నారని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ స్వల్ప మోజారిటీతో గెలిచింది. అయితే ముఖ్యమంత్రి పదవిని అకాంక్షించిన సింధియాకు భంగపాటు ఎదురైంది. ఆయనకు కాకుండా సీనియర్ నేతైన కమల్ నాథ్ కు ఆ పదవిని కట్టబెట్టి.. సింధియాకు ఉపముఖ్యమంత్రి పదవిని కల్పించింది. అయినా ఆ పదవితో సంతోషించని సింధియా అప్పటి నుంచి అసమ్మతి సెగను రాజేస్తూనే వున్నారని సమాచారం. దీంతో అవకాశం కోసం వేచి చూస్తున్న ఆయనకు బీజేపీ గాలం వేసిందని.. దానికి ఆయన చిక్కకుని ఆయన వర్గం ఎమ్మెల్యేలతో షాకిచ్చారు.

సింధియా బీజేపీలో చేరి రాజ్యసభ సభ్వత్వం తీసుకుంటారని, అనంతరం కేంద్రమంత్రి పదవి కూడా చేపడతారన్న వార్తలు జోరుగా షికారుచేస్తున్నాయి. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి  బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రాబోతోందని కాంగ్రెస్ ముందుగానే ఊహించినట్టు ఇటీవల ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. కమల్‌నాథ్ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles