NBW issued against BJP MP Jaya Prada ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో ఎంపీ జయప్రదపై ఎన్బిడబ్యూ జారీ

Non bailable warrant issued against jaya prada for violation of model code of conduct

Jaya Prada, Samajwadi Party, Azam Khan, Lok Sabha elections, nbw warrant, Rampur court, Election code of conduct, Uttar Pradesh, Politics

A non-bailable warrant has been issued by a Rampur court against veteran actor and BJP leader Jaya Prada in a violation of model code of conduct case of 2019. The next hearing in the case is on April 20.

నటి, ఎంపీ జయప్రదపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ

Posted: 03/07/2020 10:47 AM IST
Non bailable warrant issued against jaya prada for violation of model code of conduct

నిన్నటి తరం హీరోయిన్.. బీజేపి పార్లమెంటు సభ్యురాలు జయప్రదపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు ఈ ఎన్బీడబ్యూ వారెంట్ ను జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై కోర్టు ఆమెపై ఆ వారంట్ జారీ చేసింది. ఈ కేసు తరుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా జయప్రద తనపై జారీ అయిన నాన్ బెయిలెబుల్ వారెంట్ ను రికాల్ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

అసలు కేసు ఏమిటీ అన్న వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమె ఎన్నికల ప్రవర్తనా నియమావళి కోడ్ ను ఉల్లంఘించారన్న అభియోగాలపై పోలీసులు జయప్రదపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో, కోర్టు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల సమయంలో అమె సమాజ్ వాదీ పార్టీ నుంచి వీడి బీజేపిలో చేరిన విషయం తెలిసిందే.

దీంతో రాంపూర్ లోక్ సభ స్థానంలో అసక్తికర పోటీ ఏర్పడింది. గతంలో ఓ సారి జయప్రద ఎస్పీ పార్టీ తరపున ఇక్కడి నుంచి బరిలో దిగి గెలిచారు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ నేత అజాం ఖాన్ కు కంచుకోటగా మార్చుకున్న అదే నియోజకవర్గంలో ఆయనపైనే జయప్రద పోటీకి దిగడంతో ఇరువురి మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు సాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తోసిరాజుతూ అజాం ఖాన్ పై అమె పలు వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలో కేసు నమోదైంది. కాగా, సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్.. జయప్రద చేతిలో లక్ష ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles