విదేశీయానం చేసిన తిరిగొచ్చిన మనవారితో, విదేశీ పర్యాటకులతో దేశంలోకి చోచ్చుకొచ్చి.. అప్పుడే 31 మందిని తన కబంధహస్తాల్లోకి తీసుకన్న కరోనా వైరస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. క్రితం రోజు రాత్రి వరకు 30 మందికి మాత్రమే వున్న బాధితుల సంఖ్య ఢిల్లీలో మరో వ్యక్తి కూడా సోకడంతో 31కి చేరింది. ఈ క్రమంలో ఇటీవల శ్రీమద్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో దశాబ్దాల క్రితమే ఈ కరోనా వైరస్ గురించి చెప్పారన్న వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
తన కాలజ్ఞానంలో ‘‘ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను.. లక్షలాధి ప్రజలు నచ్చేరయ.. కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి కోడిలాగా తూగి నచ్చేరయా.. శివ గోవింద గోవిందా.. అంటూ స్వామిజీ పేర్కెన్నారు. అయితే కరోనా వ్యాధి గురించే బ్రహ్మంగారు చెప్పారంటూ నెటిజనులు ఆనాటి వ్యాఖ్యలను నెట్టింట హల్ చల్ చేస్తున్న ఈ సందర్భంలోనే 40 ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని మేము చెప్పామంటూ ఓ అమెరికా రచయిత డీన్ కూంట్జ్ పుస్తకాన్ని నెట్టింట్లో హల్ చల్ చేశారు. అయితే దీనిపై అధ్యయనం చేసిన ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్.. ఇందులో నిజమున్నది పాక్షికమేనని అన్నారు.
అయితే డీన్ కూంట్జ్ రాసిని ఎండ్ అప్ డార్క్ నెస్ అనే పుస్తకంలో ఈ కథనమే లేదని పేర్కోన్న రాయిటర్స్.. ఈ పేజీలను 2008లో రాసిన ఎండ్ అప్ డేస్ లోంచి తీసుకున్నదిగా పేర్కోంది. అంతేకాదు.. కరోనా వైరస్ కు సంబంధించిన పేరు వూహన్ 400గా పేర్కోన్నారని, ఇక ఆ వ్యాధి ఆ నగరానికి బయట నుంచి వస్తుందని పుస్తకంలో వుందని, కానీ ఈ వ్యాధికి పుట్టిందే వూహన్ లో అని పేర్కోంది రాయిటర్స్. ఇక ఈ వ్యాధి లక్షణాలు పుస్తకంలో రచయిత పోందుపర్చిన లక్షణాలకు కూడా పూర్తి భిన్నంగా వుందని అన్నారు.
ఇలా రాయిటర్స్ సంస్థకు తెలియకుండానే కరోనా వ్యాధి గురించి ఊహాత్మక అంచనాను ‘ఎండ్ అప్ డేస్’.. ప్రపంచ ముగింపు నేపథ్యంలో ఊహాత్మకలు, ప్రవచనాలు అంటూ సిల్వియా బ్రౌనీ రచించిన పుస్తకంలోని కథనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది రాయిటర్స్ సంస్ధ. దీంతో ఎండ్ ఆఫ్ డేస్ పుస్తకం గురించి.. ఆ పుస్తక రచయిత సిల్వియా బ్రౌనీ గురించి నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. అంతేకాదు.. సిల్వియా బ్రౌనీ ఓ మానసిక నిఫుణురాలనే విషయం కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అమె ఫోటోను కూడా నెటిజనులు షేర్ చేయడంతో ప్రస్తుతం అమె చెందిన అంశాలన్నీ ట్రెండింగ్ గా మారాయి.
ఇంతకీ అమె ఎం చెప్పారంటే.. సుమారు 2020లో న్యూమెనియా వంటి తీవ్రమైన వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సోకుతుందని అమె పేర్కోన్నారు. ఇది ఊపిరితిత్తులు, శ్వాసశాళ గొట్టాలపై దాడి చేస్తోందని తెలిపారు. అంతేకాదు ఈ వ్యాధి నియంత్రణకు తెలిసిన అన్ని చికిత్సలను ప్రయోగించినా నిరోధిస్తుందని.. అయితే ఇది ఎంత త్వరగా వ్యాప్తి చెందుతుందో.. అంతే త్వరగా కనిపించకుండా పోతుందని, మళ్లీ పదేళ్ల నాటికి తిరిగి వస్తుందని, ఆ తరువాత పూర్తిగా కనుమరుగైపోతుందని అమె తన ఊహాత్మక అంచనాలను వెలువరించారు.
అయితే అమె చెప్పిన ఊహాలన్నీ నిజంగానే నిజం కావడంతో.. కరోనా వైరస్ సోకినవారిలో వైరస్ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం గమార్హం. దీంతో పాటు తెలిసిన అన్ని చికిత్సా మార్గాలకు కూడా ఈ వైరస్ లొంగకుండా.. వ్యాప్తి చెందడం కూడా రచయిత్రి అంచనా వేసినట్లుగానే వుందని నెట్ జనులు అమె రాసిన పుస్తకం కవర్ పేజీలో పాటు అమె ఈ వైరస్ గురించి చెప్పిన సారాంశాన్ని ఎర్రగా మార్క్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక మరికోందరు అమె పుస్తకంతో పాటు అమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇలా ఆమెకు చెందిన ప్రతీ టాపిక్ ఇప్పడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే అమె సారంశాన్ని చదవి అర్థం చేసుకున్న వాళ్లు మాత్రం.. కొంత ధైర్యంగా వుండేలా పోస్టు పెడుతున్నారు. కరోనా వ్యాధి గురించి భయపడింది చాలు.. ఇక కొంత కాలం ఒపిక పట్టండంటూ నెట్ జనులు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. కరోనా వైరస్ అనగానే ప్రపంచవ్యాప్తంగా భయపడిన జనం.. సిల్వియా బ్రౌనీ రాసిన కథనం ప్రాచుర్యంలోకి రావడంతో ఇక త్వరగానే ఈ వైరస్ కనుమరుగు అవుతుంది అంటూ ఒకరికోకరు ధైర్యం చెబుతున్నారు. ఇక భయపడకండీ త్వరలోనే ఈ వైరస్ కనుమరుగు అవుతుంది అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more