Congress Protest Against Suspension Of 7 MPs ఢిల్లీ హింసకు భాధ్యత అమిత్ షాదే.. రాజీనామా చేయాలి: రాహుల్

Rahul gandhi leads protest against suspension of congress mps

CAA Protests, Delhi violence, Delhi Riots, delhi clashes, Rahul Gandhi, Congress MPs, citizenship law, Central Government, peace return, Kapil Mishra, northeast delhi protests, caa protest violence, Chand Bagh, delhi violence deaths, Shaheen Bagh, northeast delhi riots, Citizenship amendment act, Narendra Modi, Amit Shah, National Politics, Crime

Congress leader Rahul Gandhi led a protest of senior Congress leaders on the Parliament premises, against the suspension of seven party MPs from the Lok Sabha for the remaining period of the Budget Session for "gross misconduct" and "utter disregard" for House rules after they snatched papers from the speaker''s table.

ఢిల్లీ హింసకు కేంద్ర హోంశాఖే కారణం: రాజీనామాకు రాహుల్ డిమాండ్

Posted: 03/06/2020 02:15 PM IST
Rahul gandhi leads protest against suspension of congress mps

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో రేగిన హింసపై పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు ఇవాళ ఉదయం నిరసన తెలిపారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అల్లర్లతో దేశప్రజలు హడలెత్తిపోయారని, భయాందోళనకు గురయ్యారని, ఇంతటి హింసకు కారణమైన కేంద్ర హోంశాఖ మంత్రి తన పదవిలో ఎలా కొనసాగుతారని రాహుల్ ప్రశ్నించారు.  

ఢిల్లీ అల్లర అంశంతో పాటు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న డిమాండ్ను తాము పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. అల్లర్ల మాటును అందోళనకారులు చేసిన ఆకృత్యాలను. ఘోరాలు ఎన్నో వున్నాయని ఆయన అరోపించారు. విభజించే భావజాలం, విధ్వేషించే కుట్రలు, రెచ్చగోట్టి ప్రేరేపించే హింసమార్గాలు సామరస్యంగా వున్న దేశానికి, దేశ ప్రజలకు ఎంతమాత్రం మంచివి కాదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంటులో చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ తో పాటుగా ఎన్డీయేతర పార్టీలన్నీ ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నాయి. పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగకుండా బీజేపీ ప్రయత్నాలు జరుపుతోందని టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరిక్ ఒబ్రెయిన్‌ ఇవాళ విమర్శలు గుప్పించారు. పార్లమెంటు రెండో దశ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 'ఢిల్లీ హింస'పై చర్చకు ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఈ రోజు పార్లమెంటులో తాను తప్పకుండా ఈ అంశంపై మాట్లాడి తీరుతానని చెప్పారు.

ఇక అంతకుముందు ఆర్థిక ఒడిదోడుకులకు గురైన యస్ బ్యాంకుపై మానటోరియం విధించడంతో పాటు ఆ భ్యాంకు ఖాతాదారులు నగదు ఉపసంహరణపై భారతీయ రిజర్వుబ్యాంకు ఆంక్షలు విధించింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఇది యస్ బ్యాంక్ తప్పిదం కాదని, ఇది పూర్తిగా ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న ఆర్థిక విధానమని.. దీంతోనే బ్యాంకులు అర్థికతిరోగమనంలోకి జారుకుంటున్నాయని దుయ్యబట్టారు. ప్రధాని ఆర్థికపరమైన అలోచనలే భారత్ ఆర్థిక వ్యవస్థకు కారణాలని.. బ్యాంకుల తిరోగమనానికి మూలకారణమని రాహుల్ దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles