coronavirus | Sikkim Bans Entry of Foreign Nationals విదేశీ పర్యాటకులను నిషేధించిన తొలి రాష్ట్రంగా సిక్కిం!

Coronavirus scare sikkim bars entry of foreigners bans permits to nathu la

Foreigners, Sikkim, Bank, Tourists, Corona Virus, Nathu La, Kerala, Darjeeling, Anil Punjabi, amit periwal, Inner Line Permits (ILP), foreign nationals, Sikkim Government, World Health Organisation (WHO)

With the ongoing coronavirus outbreak registering 30 positive cases across India, Sikkim has banned the entry of foreigners at the Rangpo check post. As per reports, all foreigners are being sent back from Rangpo check post where the officials have initiated a strict checking of people for coronavirus.

కేంద్రం అలర్ట్ అదేశాలు.. విదేశీ పర్యాటకులను నిషేధించిన సిక్కిం!

Posted: 03/06/2020 01:44 PM IST
Coronavirus scare sikkim bars entry of foreigners bans permits to nathu la

విదేశాలకు వెళ్లిన పర్యాటకులతో లేదా విదేశీ పర్యటనలకు వెళ్లిన స్వదేశీయులతో మాత్రమే కరోనా వైరస్ దేశంలోకి చోచ్చుకొచ్చిందని వైద్యులు చెబుతున్న క్రమంలో భారత వైద్య అరోగ్యశాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో దానిని వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చునని వైద్యముఖ్యుల సూచనలతో సిక్కిం రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

తమ రాష్ట్రానికి విదేశీ పర్యటాకుల తాకిడి అధికంగా వున్న నేపథ్యంలో కరోనా వ్యాధి రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా తమ రాష్ట్రంలోకి విదేశీ పర్యాటకులకు ప్రవేశం లేదంటూ చైనా సరిహద్దుల్లోని సిక్కిం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాలో విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. రాష్ట్ర పరిధిలోని గ్యాంగ్‌ టక్, డార్జిలింగ్, నాథులా తదితర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ లో విదేశీయులందరి బుకింగ్స్ నూ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మామూలుగా అయితే, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికన్లతో పాటు ఫ్రెంచ్, జర్మన్లు, జపనీయులు, చైనీయులు సిక్కిం రాష్ట్రానికి పర్యటనల నిమిత్తం వస్తుంటారు. విదేశీ పర్యాటకులను తీసుకుని రావద్దని వివిధ టూర్ ఆపరేటర్లకు సైతం ఆదేశాలు జారీ అయ్యాయి. పర్మిట్ల జారీని సైతం నిషేధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి సిక్కిం, డార్జిలింగ్ తదితర ప్రాంతాల్లో విదేశీ పర్యాటకులు వారం రోజుల పర్యటనకు వస్తుంటారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ టూరిస్టులను ఎవరినీ అనుమతించవద్దని ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు క్లబ్ సైడ్ టూర్స్ అండ్ ట్రావెల్ యజమాని అమిత్ పెరివాల్ వెల్లడించారు.

హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం

కరోనావైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యాధి భారిన పడిన పలు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు  చర్యలు తీసుకుంటున్న క్రమంలో మిగిలిన రాష్ట్రాలను కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని అదేశాలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles