Good News to Hyderabad Metro commuters హైదాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

Good news to hyderabad metro commuters

Hyderabad Metro Rail, Hyderabad Metro, Hyderabad Metro news, new routes of Hyderabad Metro, HMR MD N.V.S. Reddy, A.K. Saini

HMR managing director N.V.S. Reddy disclosed that two new three coach trains will be pressed into service from Ameerpet to Raidurg within “10 days”, after getting the confirmation from L&TMRH Chief Operating Officer A.K. Saini during the launch of Paytm’s QR-code based metro ticketing system at the Metro Rail Bhavan.

హైదాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

Posted: 03/06/2020 12:28 PM IST
Good news to hyderabad metro commuters

హైదరాబాద్ మహానగరంలోని అనేక ప్రాంతాలను.. అందునా అత్యంత రద్దీ కలిగిన ప్రాంతాలను కలుపుతూ నగర మణిహారంలా పెనవేసుకున్న మెట్రో రైలు ప్రయాణికులకు రెండు మూడు రోజుల్లో మరో శుభవార్త అందిస్తామని మెట్రో రైలు అధికారులు తెలిపారు. మెట్రో రైలు ప్రారంభంలో ఈ రైలు సేవలతో పాటు ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలకు కొనసాగించేలా ఉమ్మడి రవాణ పాస్ ను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించిన అధికారులు త్వరలో దానిని ప్రయాణికుల ముందుకు తీసుకురానున్నారు.

భవిష్యత్తులో ఆర్టీసీ, ఉబెర్ వంటి సంస్థలతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుని ఒకే టికెట్‌పై ప్రయాణించే వెసులుబాటును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో పాస్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. అలాగే, కరోనా వైరస్ గురించి మెట్రో ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.  రైలును ప్రతి రోజూ కెమికల్ శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు.

మూడు నెలల క్రితం హైదరాబాద్ మెట్రో ప్రవేశపెట్టిన ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ క్యూఆర్ కోడ్ విధానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 60 వేలకు చేరినట్టు పేటీఎం భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ విధానం వల్ల టికెట్ల కోసం క్యూలలో నిల్చునే బాధ పద్దతికి వీడ్కోలు చెప్పవచ్చునన్నారు. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఫీడర్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles