Rahul Gandhi questions Modi govt over Pulwama attack ఈ ప్రశ్నలకు బదులేదీ.?: రాహుల్

Pulwama attack who benefitted most from it asks rahul gandhi

Rahul Gandhi takes on BJP, Rahul Gandhi on Pulwama anniversary, Rahul Gandhi targets BJP on Pulwama, Rahul Gandhi, lethpora camp, CRPF personnel killed, Jammu and kashmir, Pulwama terror attack, memorial, Congress, BJP. Politics

Congress leader Rahul Gandhi on Friday remembered the 40 CRPF personnel killed in the Pulwama attack last year and asked who benefitted the most from the attack and what is the outcome of the inquiry into it. Gandhi asked who in the BJP government had been held accountable for the security lapses that allowed the attack.

పూల్వామా ఘటనకు ఏడాది: ఈ ప్రశ్నలకు బదులేదీ.?: రాహుల్

Posted: 02/14/2020 04:11 PM IST
Pulwama attack who benefitted most from it asks rahul gandhi

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా దాడి జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా అమరవీరులకు ఓ వైపు నివాళులు అర్పిస్తూనే మరోవైపు అధికార బీజేపి ప్రభుత్వంపై ఇదే సందర్బంలో విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. ఈ దాడి నేపథ్యంలో ఏడాది క్రితం తెరపైకి వచ్చిన ప్రశ్నలతో పాటు మరికొన్ని ప్రశ్నలను సంధించారు రాహుల్. ఈ దాడి వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందని ప్రశ్నించిన ఆయన.. తన మూడు ప్రశ్నలకు ప్రభుత్వం లేదా అధికార పార్టీ సమాధానాలు చెప్పాలంటూ నిలదీశారు.

‘పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్‌ అమర జవాన్లను మనం ఈ రోజు స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా కేంద్రాన్ని మనం అడగాల్సినవి ఇవే..
1. ఈ దాడితో ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది?
2. దాడిపై చేపట్టిన దర్యాప్తులో ఏం తేలింది?
3. దాడికి కారణమైన భద్రతా లోపాలకు బీజేపి ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తున్నారు?’ అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. గతేడాది ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. ఆయన ఆధీనంలో వున్న ఇంటెలిజెన్స్ శాఖ వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందని అరోపించారు. అంతటితో ఆగని రాహుల్.. పుల్వామా దాడి జరిగిన సమయంలో ప్రదాని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సినిమా ప్రివ్యూ వేడుకలో బిజిగా వున్నారని, దాడి ఘటన జరిగిన గంటకు కానీ ఆయన  దానిపై సమీక్షించలేనంత బిజీగా వున్నారని వ్యంగస్త్రాలు సంధించారు.

గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడితో యావత్ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మన భద్రత, నిఘా వ్యవస్థపై అనేక సందేహాలకు ఈ దాడి కారణమైంది. ఈ దాడి తర్వాత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇటీవల ఉగ్రవాదులకు సాయం చేస్తూ పట్టుబడిన కశ్మీర్‌ పోలీసు అధికారి దవీందర్‌ సింగ్ కు కూడా పుల్వామా దాడితో సంబంధం ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ చేసిన తాజా ట్వీట్‌ మరోసారి రాజకీయ వివాదానికి తెరతీసే అవకాశం కన్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles