Centre refuses to stop Jagan's move to have three capitals అంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రం తొలి స్పందన ఇది..

Centre refuses to prevent jagan s transfer to have 3 capitals

TDP MP, Guntur MP, Galla Jayadev, Nityanand roi, Union Home Minister for state, state capital, Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The protest of farmers of Amaravati region continues for 49th day, demanding Amaravati a single capital. Meanwhile In a spice up to Andhra Pradesh chief minister Y S Jagan Mohan Reddy’s 3 capital proposal, the central executive has categorically stated it’s the state’s trade the place to find its capital.

పార్లమెంటులో అమరావతి.. రాజధానిపై కేంద్రం తొలి స్పందన ఇది

Posted: 02/04/2020 03:38 PM IST
Centre refuses to prevent jagan s transfer to have 3 capitals

రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 49 రోజులుగా అమరావతి ప్రాంత రైతుల అందోళనలు చేపడుతున్న క్రమంలో అమరావతి ప్రాంత రైతులు అందోళనలను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ అంశంపై తొలిసారిగా కేంద్రప్రభుత్వం స్పందించింది. గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజదాని విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్రప్రభుత్వానిదేనని ఆయన తేల్చిచెప్పారు.

రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో ఏక్కడైనా ఏర్పాటు చేసుకునే వెసలుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి వుంటుందని నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. 2015 ఏప్రిల్‌ 23న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. కాగా, నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి ఉన్నది’’ అని నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు.

మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్రప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, యువజనులు ఉద్థృతంగా అందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన తమకు అన్యాయం చేయడమేంటని ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వెళ్తే లాఠీఛార్జి చేస్తారా? అని ప్రశ్నించారు. చలో అసెబ్లీకి పిలుపునిస్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సభ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రహోంశాఖ లిఖితపూర్వకంగా జయదేవ్ కు సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles