Akshay Thakur files mercy plea before Prez ‘నిర్భయ’ కేసు: వాయిదాల మీద వాయిదాలా.? నిలదీసిన అప్

Tareekh pe tareekh aap leader laments delay in nirbhaya case hangings

Rajya Sabha, M Venkaiah Naidu, AAP MP Sanjay Singh, President, Prakash Javadekar, Nirbhaya convicts, Execution, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Supreme Court, gang-rape, Crime

The issue of delay in hanging of convicts in the Nirbhaya gang-rape case came up in the Rajya Sabha, with AAP demanding intervention of the President or the CJI in the matter. Chairman M Venkaiah Naidu said the matter was "very sensitive and serious" and the court judgement must be implemented at the earliest.

రాజ్యసభలో ‘నిర్భయ’ కేసు: వాయిదాల మీద వాయిదాలా.? నిలదీసిన అప్

Posted: 02/04/2020 04:46 PM IST
Tareekh pe tareekh aap leader laments delay in nirbhaya case hangings

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు తమకు విధించిన మరణశిక్షను తప్పించుకునేందుకు పిటీషన్లపై పిటీషన్లు దాఖలు చేస్తూ.. వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారని, ఈ విషయంలో భారత రాష్ట్రపతి లేదా ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని అప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు. దేశంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు వేస్తారని తెలిసినా.. శిక్షలను అమలు కానీయకుండా దోషులు కూడా వాయిదాలపై వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తున్న నేపథ్యంలో దేశప్రజలందరూ ఆసంతృప్తితో వున్నారని అన్నారు.

రాజ్యసభలో నిర్భయ ఘటనపై చర్చను లేవనెత్తిన ఆయన దేశప్రజలు ఇలాంటి నేరాలను తిప్పకొడతామంటూ రోడ్లపైకి వచ్చిన విషయాన్ని మర్చిపోరాదని అన్నారు. ఈ క్రమంలో శిక్షను అమలు పర్చడంలో జాప్యం జరిగడం సహేతుకం కాదని అన్నారు. దీనిపై తక్షణం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లేదా భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాడ్బే లు జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ నిర్భయ అంశం చాలా సున్నితమైనదని, అలాగే చాలా సీరియన్ అంశమని అన్నారు. ఈ విషయంలో న్యాయస్థానాల తీర్పును సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని అన్నారు.

నిర్భయ కేసులో దోషులకు జనవరి 22న ఉరి శిక్ష అమలు చేయాలని డెత్ వారెంట్ జారీ అయ్యింది. ఆ తరువాత అది ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఇక ఫ్రిబవరి ఒకటిన మరోమారు వాయిదా పడిన శిక్ష అమలు తదుపరి ఉత్తర్వులు ఎపుడు వస్తాయా.? అని వేచిచూసే పరిస్థితి వచ్చిందని పేర్కోంటూ.. దామిని చిత్రంలో తారీఖ్ పే తారీఖ్ అనే పాపులర్ డైలాగ్ ను వినియోగించారు. ఈ క్రమంలో రాజకీయ కారణాలు కూడా దోషులకు శిక్షను అమలు కానీయకుండా చేస్తున్నాయని సంజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కాగా ఈ అంశంలో ఢిల్లీలోని అప్ ప్రభుత్వం కూడా దోషులకు శిక్షను అమలు చేయడంలో జాప్యం చేసిందని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles