Sake Sailajanath appointed as new president for APCC ఆంధ్రప్రదేశ్ కొత్త పీసిసిగా శైలజానాథ్ నియామకం

Congress appoints sake sailajanath as new president for andhra pradesh

Sake Sailajanath, Sailajanath, PCC president, PCC chief, ap pcc president, andhra pradesh pcc chief, Congress president andhra pradesh, AP congress chief, Andhra Pradesh, Politics

The Congress on Thursday appointed Sake Sailjanath as the new president of Andhra Pradesh Congress, replacing N Raghuveera Reddy. The party also appointed N Tulasi Reddy and Shaikh Mastan Vali as working presidents for Andhra Pradesh Congress.

ఆంధ్రప్రదేశ్ కొత్త పీసిసిగా శైలజానాథ్ నియామకం

Posted: 01/16/2020 07:32 PM IST
Congress appoints sake sailajanath as new president for andhra pradesh

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులను ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. దళిత వర్గానికి చెందిన డాక్టర్ సాకే శైలజానాథ్ ను పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించారు. తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటి వరకూ బీసీ సామాజిక వర్గానికి చెందిన రఘువీరా రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నారు.

ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రఘువీరా స్థానంలో దళితుడికి అవకాశం ఇవ్వడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు రాజీనామాలు చేయగా.. అదే బాటలోనే రఘువీరా కూడా తన పదవికి రాజీనామా సమర్పించారు. అయితే రఘువీరా రాజీనామాను కాంగ్రెస్‌ హైకమాండ్ అప్పట్లో ఆమోదించలేదు. గత కొంత కాలంగా రఘువీరా రాజకీయాల్లో యాక్టింగ్ గా ఉండటం లేదు.

అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్.. 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున సింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్ర మంత్రిగానూ సేవలందించారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హాయంలోనూ ఆయన మంత్రిగా బాద్యతలను నిర్వర్తించారు. అదే సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఒకానొక దశలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో మళ్లీ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే కార్యచరణ ప్రారంభించింది. అందుకే ఒకప్పుడు తమకు అండగా నిలిచిన దళిత, రెడ్డి, ముస్లిం వర్గాలకు పీసీసీ పదవులను కట్టబెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles