BJP sees Delhi govt''s ''complicity'' in delay in Nirbhaya case ‘నిర్భయ’ దోషుల ఉరిశిక్షలో ‘అప్’ వల్లే జాప్యం: కేంద్రమంత్రి

Bjp sees delhi govt s complicity in delay in nirbhaya case

curative petition, Prakash Javadekar, patiyala court, AAP, Arvind Kejriwal Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

The Centre accused the Delhi government of delaying the hanging of convicts in Nirbhaya gangrape-murder case. Union Minister Prakash Javadekar said the hanging has been delayed in the justice due to "negligence of the Delhi government". AAP is responsible for this delay in justice," Prakash Javadekar said

‘నిర్భయ’ దోషుల ఉరిశిక్షలో ‘అప్’ వల్లే జాప్యం: కేంద్రమంత్రి

Posted: 01/16/2020 06:47 PM IST
Bjp sees delhi govt s complicity in delay in nirbhaya case

నిర్భయ హత్యాచార కేసులో దోషులుగా తేలిన నలుగురికి ప్రాణభయం పట్టుకుంది. ఈ నెల 22న మరణశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ కోర్టు తీర్పునిస్తూ డెత్ వారెంట్ జారీచేసిన నేపథ్యంలో దోషులకు కంటి మీద కునుకు కరువై పోయింది. ఉరి శిక్ష భయం వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తీహాడ్‌ జైలు అధికారులు తెలిపారు. ఈ భయంతోనే నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తన సెల్ లో విరామం లేకుండా నడుస్తున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.

ముకేశ్‌ మినహా ముగ్గురు దోషులు జైల్లో పనిచేస్తూ రూ.1.37 లక్షలు సంపాదించారు. ఉరిశిక్షకు ముందు దోషులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే.. వారిని ఎప్పుడు కలుసుకోవాలని అనుకుంటున్నారని జైలు సిబ్బంది దోషులను అడగ్గా సమాధానం చెప్పలేదని జైలు అధికారులు వెల్లడించారు. దోషులు స్పందించకపోతే వారి కుటుంబసభ్యులను ఎప్పుడు కలవాలనే తేదీని జైలు అధికారులే నిర్ణయిస్తారు.

ఇదిలావుండగా.. నిర్భయ కేసును కూడా పార్టీలు రాజకీయాంగా వినియోగించుకుంటున్నాయి. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన వారంలోనే ఆప్ ప్రభుత్వం దోషులందరికీ నోటీసులు ఇచ్చి ఉంటే ఈ పాటికి వారిని ఉరి తీసి ఉండేవది.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో  నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని జవదేకర్ ఆరోపించారు.

నిర్భయ కేసులో న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం గత రెండున్నరేళ్ళలో  నిర్బయ కేసు నిందితులకు క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేసేందుకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రశ్నించారు. ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఢిల్లీ పాటియాలా కోర్టు సూచించింది. దీంతో నిందితుల్లో ఒకరైన ముకేష్  సింగ్ పెట్టుకున్న క్షమాభిక్షశ్ర పిటీషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరింది.  ఆ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నక్ సిఫార్సు చేశారు.

2012 డిసెంబర్ 16 వ తేదీ రాత్రి ఢిల్లీలోని బస్సులో 23 ఏళ్ళ మహిళపై  అత్యాచారం చేసినందుకు నిందితులకు కోర్టు మరణశిక్ష విదించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు వారిని ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది.  ఈ  నేపధ్యంలో దోషుల్లో ఇద్దరు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్లు దాఖలు చేయగా వాటిని న్యాయస్ధానం కొట్టి వేసింది.  దీంతో దోషుల్లో మరోకరైన ముకేష్ సింగ్ రాష్ట్రపతి. ఢిల్లీ ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటీషన్  పెట్టుకున్నాడు. క్షమాభిక్ష పిటీషన్ పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్ష అమలు చేసేందుకు నిబంధనలు ఒప్పకోవని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ఫ్రభుత్వానికి లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  Murder  Rape  convicts  Tihar jail  Prakash Javadekar  patiyala court  AAP  Arvind Kejriwal  crime  

Other Articles