Amaravati parirakshana samiti JAC Office locked అమరావతి పరిరక్షణ సమితీ జేఏసీ కార్యాలయానికి తాళాలు

Amaravati parirakshana samiti jac office locked by police at vijayawada

YS Jagan, Amaravati, joint action committee, JAC Office, benz circle, police restrictions, former MP, chennupati vidhya, wazir, CI Suresh Reddy, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Intensifying the agitation, and supporting the farmers of the capital city area Amaravati Parirakshana samiti JAC opened its office on busy Vijayawada Road at Benz circle. police had locked the office and took the charge over the building ans insisted the building owner to make the office vacate.

అమరావతి పరిరక్షణ సమితీ జేఏసీ కార్యాలయానికి తాళాలు

Posted: 01/10/2020 02:23 PM IST
Amaravati parirakshana samiti jac office locked by police at vijayawada

అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి కేంద్ర కార్యాలయాన్ని పోలీసులు మూసివేశారు. ఓ వైపు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజధాని అమరావతి అందోళనలను అణిచివేస్తోందన్న విమర్శల వెల్లువెత్తుతున్న క్రమంలో.. పోలీసులు బాహాటంగానే ఇలాంటి చర్యలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జేఏసీ కార్యచరణ సమితికి పోలీసులు తాళాలు వేసి పహారా ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. అంతకుముందు విజయవాడ నగరం నడిబొడ్డున బెంజి సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించాలని అదేశాలు కూడా జారీ చేయడం చర్చకు తావిస్తోంది.

కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చిన భవన యజమానికి మౌఖికంగా బెదిరింపులకు గురిచేయడంతో పాటు నోటీసు ఇచ్చి మరీ కళ్యాణమండపానికి అనుమతులు రద్దు చేసి చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయగలమంటూ పటమట పోలీసుస్టేషన్‌ సీఐ సురేష్ రెడ్డి నోటీసు జారీ చేశారు. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా విజయవాడ కేంద్రంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో 45 సంఘాల భాగస్వామ్యంతో జేఏసీని ఏర్పాటుచేశారు. రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, ఉపాధ్యాయ, మహిళా కార్మిక సంఘాలు భాగస్వాములై.. విజయవాడ ధర్నాచౌక్ లో ఆందోళనలు చేస్తున్నారు.

దీనికి కేంద్ర కార్యాలయం కోసం బెంజిసర్కిల్ లో వేదిక కల్యాణ మండపాన్ని అద్దెకు తీసుకున్నారు. మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తనయుడు చెన్నుపాటి వజీర్ ఈ కళ్యాణ మండపం యజమాని‌. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి కల్యాణ మండపం గేటుకు తాళాలు వేశారు. కార్యాలయానికి ఎలా అనుమతిచ్చారని మేనేజర్ ను ప్రశ్నించారు. వెంటనే ఖాళీ చేయించాలని హుకుం జారీచేశారు.

అయితే గురువారం ఉదయం చంద్రబాబు కార్యాలయానికి వస్తున్నారని తెలిసి పోలీసులు తిరిగి తాళాలు ఇచ్చి ఒక్కరోజే నడపాలని.. శుక్రవారం నుంచి అనుమతి లేదని హెచ్చరించారు. గురువారం ఉదయం 8 గంటలకు ఒక నోటీసు జారీ చేశారు. రాత్రికి తాళాలు వేశారు. ఈరోజు ఉదయం కార్యాలయం వద్దకు చేరుకున్న జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గేటుకు తాళం వేసి, కార్యాలయం వైపు ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు. సీఎం జగన్‌ ఇదే మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles