"Dead" Woman Comes Back To Life చనిపోయిందని ప్రకటించిన మహిళ.. లేచి కూర్చుందీ..

Dead woman comes back to life at funeral bath in pakistan

Rasheeda Bibi, paralysis, Abbasi Shaheed Hospital, Intensive Care Unit (ICU), morgue, Karachi, Pakistan, weird news

A woman who 'came back to life' after being pronounced dead by doctors at a hospital. Doctors had pronounced Rasheeda Bibi, 50, dead after she was brought to Abbasi Shaheed Hospital the day before. The hospital staff put her in the morgue where she remained for 45 minutes.

అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుంటే.. లేచికూర్చున్న ‘‘మృత’’మహిళ

Posted: 01/10/2020 03:29 PM IST
Dead woman comes back to life at funeral bath in pakistan

చనిపోయారని కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆ వ్యక్తి బతికేవున్నాడని తెలిస్తే.. లేదా చితి పేర్చిన తరువాత ప్రాణాలతో వున్నానని అరిస్తే.. అలా కాక ఖననం చేస్తుండగా ఒక్కసారిగా లేచి నిలబడితే.. అమ్మో.. గుండెలు జారిపోవు.. ఇక బందువులతో పాటు అందరూ భయపడి పరుగు లఖించుకోరూ. దెయ్యం అని అంటారో.. లేక మరేపేరు పెడతారో కానీ.. అప్పటిమటుక్కు అందర్నీ తీవ్ర భయాందోళనకు గురిచేసే ఘటనే ఇది.

ఓసోస్ మాకు తెలుసు.. ఇలాంటి కథలతో ఎన్ని సినిమాలు తెరకెక్కలేదు అని అంటున్నారు కదూ.. అయితే సినిమా వేరు నిజంగా ఈ ఘటనను అనుభవించడం వేరు. సరిగ్గా ఇలాంటి ఘటనే పాకిస్థాన్ లోని కరాచీలో జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న రషీదా బిబీ అనే 50 ఏళ్ల మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, కుటుంబీకులు అమెను కరాచీలోని అబ్బాసీ షాహీద్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అమెను వెంటనే ఐసీయూలో చేర్పించిన వైద్యులు చికిత్సను అందించారు. మరుసటి రోజు అమె చికిత్స పొందుతూ మరణించింది.

దీంతో అసుపత్రి వర్గాలు అమెను మార్చురీకి తరలించాయి. అక్కడ అమె ఏకంగా 45 నిమిషాల పాటు ఉంచారు. ఈలోగా ఆమె కుటుంబీకులు రావడంతో ఆమె మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబసభ్యులు బంధువులకు సమాచారం అందించి.. అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆమెకు చివరి స్నానం చేయిస్తుండగా, అకస్మాత్తుగా రషీదా బిబీ కళ్లు తెరచింది. ఈ ఘటనను చూసిన మహిళలు ఒక్కసారిగా భయంతో దూరంగా జరిగారు.

కొందరు దెయ్యం అంటూ అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని నివ్వెరపోయారు. ఆమె చనిపోలేదని, ఇంకా బతికే ఉందని శ్వాస తీసుకుంటోందని వైద్యులు తేల్చారు. ఈ వార్త ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. కుటుంబసభ్యులు మాత్రం అమె బతికివున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles