Two rockets hit Baghdad Green Zone targets US Embasy అమెరికా రాయభార కార్యాలయమే టార్గెట్ గా రాకెట్ల ప్రయోగం

Two rockets hit baghdad green zone attacks on us targets in iraq

Iran, Donald Trump, Green zone, US Embassy, embassies of Western nations, Katyusha rockets, Qassem Suleiman, Abu Mahdi al-Muhandis, Shi'ite militias, airstrikes, missile attack, americans, iraq, Middle East and North Africa, US news, World news

Two rockets hit the Green Zone in Iraq’s capital of Baghdad, a day after Iran launched missile attacks on bases housing U.S. and other coalition forces in Iraq,

అమెరికా రాయభార కార్యాలయమే టార్గెట్ గా రాకెట్ల ప్రయోగం

Posted: 01/09/2020 12:54 PM IST
Two rockets hit baghdad green zone attacks on us targets in iraq

బాగ్దాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై వైమానిక దాడికి పాల్పడి ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులెమాన్ ను హతమార్చినందకు.. అమెరికా బలగాలున్న ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇదివరకే ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి 80 మంది సైనికులను మట్టుబెట్టామని ఇరాన్ ప్రకటించిందంటే ఆ దేశంలో ఎంతంటి ప్రతీకారంతో రగలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. తమ దేశ సైనిక ఉన్నాతాధాకారి మరణం ఆ దేశాన్ని ఎంతలా కుంగదీసిందో కూడా ఈ చర్యలతో అర్థమవుతోంది.

అయితే అమెరికాపై ఇరాన్ కొనసాగిస్తున్న ప్రతీకార దాడులు ఇంకా కొనసాగేలానే వున్నాయి. ఇరు దేశాల మధ్య మరీ ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్దమేఘాలు అలుముకునేలా చేస్తోంది. ఒక దేశం ఆధిపత్యం కోసం మరో దేశం ప్రతీకారం కోసం సాగిస్తున్న క్షిఫుణలు దాడి ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా క్షిపణులతో దాడి చేసి ఏకంగా 80 మంది సైనికులను మట్టుబెట్టామని ఇరాన్ ప్రకటించిన మరుసటి రోజునే మరో ప్రతీకార దాడికి పాల్పడింది ఇరాన్.

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ పరిధిలోని అమెరికా ఎంబసీని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ రెండు రాకెట్లను ప్రయోగించింది. దీంతో అత్యంతకీలకమైన గ్రీన్ జోన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా విదేశాంగ రాయభారి కార్యాలయంతో పాటు పలు పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు, విదేశీ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. గ్రీన్‌ జోన్‌ లోపల రెండు కత్యూష రాకెట్లు పడి ఉన్నాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్‌ సైన్యం తెలిపింది. ఇరాక్ లోని అమెరికా సైన్యం, కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్‌ మరిన్ని దాడులకు తెగబడే అవకాశముందని భావిస్తున్నారు. అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచి వెళ్లిపోవాలని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.

సైనికాధాకారి మరణానికి ప్రతీకారం.. ఎవరీ సులేమాన్‌...

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌లో కీలక నిఘా విభాగం అయిన ఖడ్స్‌ ఫోర్స్‌కి మేజర్‌ జనరల్‌ ఖాసీం సులెమాన్‌ 1998 నుంచి అధిపతిగా ఉన్నారు. సరిహద్దు వెలుపల జరిపే దాడులు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చడం, ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌పై పోరులో ఖాసీం కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమనెయ్‌కి ఖాసీం నేరుగా రిపోర్ట్‌ చేస్తారు. 1980లో జరిగిన ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో తొలిసారి ఖాసీం వెలుగులోకి వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iran  Green zone  US Embassy  embassies of Western nations  Katyusha rockets  Qassem Suleiman  Iraq  

Other Articles