Onion kites attract the audience at kites festival కైట్ ఫెస్టివల్: ఉల్లి పతంగులకు భలే డీమాండ్..

International kite festival onion kites attract the audience

International Kite Festival 2020, audience, kites festival, ahmedabad, sabarmati riverfront, audience, gurarat, traditional

International Kite Festival 2020: In gujarat, kites fest starts at sabarmati riverfront ahmedabad, where onion kites attract the audiance as the rates are sky high in the market.

కైట్ ఫెస్టివల్: ఉల్లి పతంగులకు భలే డీమాండ్..

Posted: 01/09/2020 01:39 PM IST
International kite festival onion kites attract the audience

తాగు నీరు మాత్రమే దేశాల మధ్య యుద్దాన్ని తీసుకువస్తుందని వీరభ్రహ్మేంద్రస్వామి భవిష్యవాణిలో వెల్లడించారు. కానీ ఉల్లిపాయలు.. మాత్రం దేశాలకు రాజులైనవారిని కూడా వణికిస్తాయని తాజాగా ఆకాశానికి తాకిన ధరలే స్పష్టం చేశాయి. ఉల్లిధరల పెంపుపై ఎన్నో స్కిట్లు, ఎన్నో టిక్ టాక్ లు నెట్టింట్లోనూ హల్ చల్ చేశాయంటే.. అది ఉల్లి ఘాటుకు కాదు కానీ ఉల్లి రేటు మహత్యమని చెప్పక తప్పదు. అత్యంతధికంగా ధరలతో ప్రజల జేబులు గుల్ల చేసేశాయి. ఉల్లి పండించే రైతును కోటీశ్వరుడిగా సమాజం ఓ ప్రత్యేకతను కూడా కల్పించడానికి కారణమైంది.

రైతులందు ఉల్లి రైతు వేరయా అంటూ ఉల్లి రైతను రైతు సమాజం నుంచి తీసి ప్రత్యేక స్థానంలో కూర్చోబెట్టింది. ఇంతటి ప్రత్యేకత దక్కిందుకు ఉల్లికి వచ్చిన ధరే కారణమని తెలుస్తోంది. అయితే తాజాగా సంక్రాంతి పండగ నేపథ్యంలో కూడా ఉల్లికి డిమాండ్ పెరిగింది. అదెలా అంటే.. ఇక్కడ కూడా ఉల్లి పంతంగులే ఆ డిమాండ్ కు కారణమయ్యాయి. గుజరాత్ రాష్ట్రం నిర్వహించే అంతర్జాతీయ పంతంగోత్సవంలో ఉల్లి పతంగులు సందడి చేస్తున్నాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి నది రివర్ ఫ్రంట్ దగ్గర పతంగోత్సవ్ ను సీఎం విజయ్ రూపాణీ ప్రారంభించారు. ఈ కైట్ ఫెస్టివల్ లో ఉల్లి ఆకారంలో తయారు చేసిన  పతంగులు గాలిలో ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ప్రతీ ఏడాది ఏదో విభిన్నత చోటుచేసుకునే ఈ పంతంగోత్సవంలో.. ఈసారి ఉల్లి పతంగులకు మరింత డిమాండ్ పెరిగింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిధరను ఈ పంతంగులు ఇవి ప్రతిబింబించడంతో.. ఈ ఉల్లి పతంగులు పతంగోత్సవ్ లోని ప్రేక్షకులను విశేషంగా అకర్షిస్తున్నాయి.

పంతంగుల పెస్టివల్ లో ఎగురవేసిన అతిపెద్ద ఉల్లి పతంగు అక్కడున్నవారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ పెద్ద ఉల్లిపతంగు తయారీలో వెదురు, టిష్యూను వినియోగించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో తొలిరోజున 43 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అలాగే మన దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 115 మంది కైట్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో బాగా హీటిక్కించించిన ఉల్లిపాయలు పంతంగుల పండుగలో కూడా నాదే పైచేయి అనడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles