Dalit sangh JAC Deeksha in support of Amaravati Farmers రైతులకు మద్దతుగా అమరావతి దళిత సంఘాల జేఏసీ ధీక్ష

Dalit sangh jac deeksha in support of amaravati farmers at tulluru

YS Jagan, Amaravati, dalit jac deeksha, alapati rajendra prasad, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Intensifying the agitation, and supporting the farmers of the capital city area Amaravati Dalit sangh JAC calls for one day deeksha at Tulluru Junction. JAC Leaders demand a single capital for Amaravati instead of three capitals.

రైతులకు మద్దతుగా అమరావతి దళిత సంఘాల జేఏసీ నేతల ధీక్ష

Posted: 01/09/2020 11:57 AM IST
Dalit sangh jac deeksha in support of amaravati farmers at tulluru

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఇవాళ్టితో 23వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకున్న రైతులు నిరసన చేపట్టారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచే రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు మద్దతుగా ఆయా ప్రాంత యువకులు, మహిళలు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.

కాగా, రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా తుళ్లూరు ధర్నా చౌక్‌ వద్ద దళిత జేఏసీ నాయకులు ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ‘సేవ్‌ అమరావతి’ అంటూ రైతులు నినదించారు. మందడంలో రైతులు రోడ్డుపైనే టెంటు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..  ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మించుకుంటామని స్పష్టం చేశారు.
    
టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి రైతులు పాదయాత్రగా బయల్దేరారు. నందివెలుగు సమీపంలోకి పాదయాత్ర చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకున్నారు.

దీంతో కాస్త వెనక్కి తగ్గిన పోలీసులు పాదయాత్ర నందివెలుగు దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరోసారి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాదయాత్రను అడ్డుకుని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీసు జీపులో దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా రైతులు, టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతుల పాదయాత్రతో గుంటూరు-తెనాలి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles