SC rejects Nirbhaya rapist's review plea, upholds death penalty నిర్భయ కేసు: దోషులకు ఉరిశిక్షే..

Supreme court rejects nirbhaya rapist s review plea upholds death penalty

Akshay Kumar, Review petition, Justice R Banumathi, Justice Ashok Bhushan, Justice A S Bopanna, Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

The Supreme court rejected the plea to review death penalty of Akshay Kumar Singh who was convicted in the 2012 Nirbhaya gang-rape and murder case. The top court observed that there is no ground to review the judgement as the evidence provided by the convict's lawyers have been examined earlier by the trial court.

నిర్భయ కేసు: దోషులకు ఉరిశిక్షే.. రివ్యూ పిటీషన్ తిరస్కరణ

Posted: 12/18/2019 03:03 PM IST
Supreme court rejects nirbhaya rapist s review plea upholds death penalty

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని దోషులకు గతంలోనే ఉరిశిక్షను ఖరారు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోమారు అదే తీర్పును వెలుగెత్తింది. హత్యాచార కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను విచారణకు స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయస్థాన విచారణపై సమీక్షను కోరే హక్కు దోషులకు లేదని.. అతడి పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీంతో పాటు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అములు చేయనున్నట్లు కూడా ప్రకటించింది.

తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన అక్షరు కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్‌ ఆర్‌.భానుమతి నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎఎస్ బోపన్నాలతో కూడాన త్రిసభ్య ధర్మాసనం రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ మధ్యాహ్నం ఒంటి గంటకు తీర్పు వెలువరించింది. పునఃసమీక్ష అంటే పునఃవిచారణ కాదని, ఇప్పటికే ఈ కేసులోని అన్ని ఆధారాలను, సాక్ష్యాలను పరిశీలించిన పిమ్మట న్యాయస్థానం దోషులకు గతంలోనే ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని ధర్మసనం వెలువరించింది.

''రివ్యూ పిటిషన్‌ వేయడానికి నలుగురు దోషులు అనర్హులు.. రివ్యూ పిటిషన్‌ వేయడానికి ఎందుకొచ్చారు. వీరిపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేద''ని అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్‌ ను తిరస్కరించారు. నిర్భయ కేసుకు సంబంధించి నలుగురు దోషులను ఎప్పుడు ఉరి వేస్తారో తెలియాల్సి ఉంది. గతంలో ఉరి శిక్ష తీర్పును ఎలా ఇచ్చారో.. ఆ తీర్పుకు మరింత బలం చేకూరేలా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. కాగా, అక్షయ్ కుమార్ వేసిన రివ్యూ పిటీషన్ లో ‘ఢిల్లీలో పొల్యూషన్‌ చాలా ఉంది.. దానిని ప్రతిరోజూ పీల్చుతూనే సగం చచ్చాం.. ఇక ఉరి శిక్షతో ఎందుకు పూర్తిగా చంపుతారు.. ఇలాగే ఈ గాలి పీల్చుతూనే చస్తామని పిటీషన్ లో పేర్కోన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  Nirbhaya  Murder  Rape  Supreme Court  gang-rape  Mount Elizabeth Hospital  Tihar jail  crime  

Other Articles