sikh riots could have been avoided: Former PM ఐకే గుజ్రాల్ శతజయంతిలో అగ్గిరాజేసిన మన్మోహన్

Sikh riots could have been avoided says former pm manmohan singh

Inder kumar Gujral, Manmohan Singh, PV Narasimha Rao, 100th birth anniversary, Sikh Riots, NV Subash, Army forces, National Politics

Former Prime Minister Manmohan Singh has said that the anti-Sikh riots in 1984 could have been avoided if the then home minister PV Narasimha Rao had called the army to intervene to stop the violence.

ఐకే గుజ్రాల్ శతజయంతిలో అగ్గిరాజేసిన మన్మోహన్

Posted: 12/05/2019 02:16 PM IST
Sikh riots could have been avoided says former pm manmohan singh

దేశ 12వ ప్రధానిగా సేవలందించిన ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఐకే గుజ్రాల్) శతజయంతి వేడుకల రోజున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అగ్గిరాజేశారు. సిక్కు అల్లర్లు జరిగి దాదాపు మూడున్నర దశాబ్దాల అనంతరం వాటిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ప్రధానిగా కీర్తగడించిన పీవీ నరసింహారావు.. సిక్కులపై దమనకాండ సాగిస్తున్న సమయంలో మాత్రం సీనియర్ నాయకుల సూచనలను అలక్ష్యం చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీలో జరిగిన ఐకే గుజ్రాల్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..  ఇందిరాగాందీ మరణానంతరం రేగిన అల్లర్లలో సీనియర్ నాయకుడైన ఐకే గుజ్రాల్ సూచనను పాటించివుంటే అల్లర్లు సమపిపోయేవని అన్నారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతర పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు ఐ.కె.గుజ్రాల్ చెప్పిన మాటలను నాడు హోంమంత్రిగా ఉన్న పి.వి.నరసింహారావు పెడచెవిన పెట్టడం వల్లే పరిస్థితి మరింత చేజారిందని మన్మోహన్ వ్యాఖ్యానించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె సెక్యూరిటీ గార్డులే కాల్చి చంపిన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా సిక్కుల ఊచకోత జరిగింది. భారీగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.

తాను, గుజ్రాల్ పాకిస్థాన్ లోని జీలం జిల్లాకు చెందిన వారమని, అంతేకాదు ఒకే ఊరి వారమని, రాజకీయాల్లో చాలా ఏళ్లు కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. అల్లర్లు జరిగిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తేనని చెప్పారు. 'ఆ రోజు గుజ్రాల్ పీవీ ఇంటికి వెళ్లారు. పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని, వెంటనే ఆర్మీని రంగంలోకి దించాలని సూచించారు. కానీ పీవీ ఆయన సలహాను సానుకూలంగా తీసుకోలేదు. ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. నాడు గుజ్రాల్ సూచన పాటించి ఉంటే ఆరోజు అంతటి దురదృష్టకర పరిణామాలు జరిగి ఉండేవి కావు' అని గుర్తు చేశారు.

కాగా మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను పీవీ నరసింహారావు మనవడు, బీజేపి నేత ఎన్.వి సుభాష్ లు తప్పుబట్టారు. సుభాష్ మాట్లాడుతూ పీవీ దార్శనికుడని, ఆయన దూరదృష్టితోనే వ్యవహరించి ఉంటారని అన్నారు. అప్పట్లో గుజ్రాల్ మాటలు విని ఆర్మీని రంగంలోకి దించి ఉంటే పెద్ద విపత్తు జరిగేదన్నారు. అయినా కేబినెట్ అనుమతి లేకుండా ఏ మంత్రి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని మన్మోహనకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. మన్మోహన్ వ్యాఖ్యలు సమర్థించేవిగా లేవని, పీవీ కుటుంబ సభ్యునిగా ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles