Pawan kalyan urges AP CM Jagan to safeguard telugu తల్లిని అవమానించకండీ.. ఉనికికే ప్రమాదం: పవన్ కల్యాణ్

Pawan kalyan urges ap cm jagan to safeguard telugu

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Telugu language, English medium, Telugu medium, Mother Tongue, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena Chief Pawan Kalyan in a latest tweet had urges Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy to safe Guard Mother Tongue ie., Telugu language.

మాతృభాషని మృత భాషగా మార్చకండి: పవన్ కల్యాణ్

Posted: 11/19/2019 10:54 AM IST
Pawan kalyan urges ap cm jagan to safeguard telugu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో అటు కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతూనే.. ఇటు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తన అస్త్రాలను సంధిస్తూనే వున్నారు. తొలి రెండు రోజులు అధికార పార్టీపై తనదైనశైలిలో సునిశిత విమర్శలు చేసిన పవన్.. గత రెండు రోజుల నుంచి కాసింత వాడి, వేడి తగ్గించారు. అయితేనేం తన సోషల్ మీడియాలో నిత్యం ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే వున్నారు. తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు విమర్శల సంధిస్తున్న ఆయన.. నిన్నటి వరకు భవననిర్మాణ కార్మికుల బతుకుల గురించి నిలదీశారు.

ఆ విషయంలో విజయం సాధించిన ఆయన.. తాజాగా మాతృబాష ఔనత్యాన్ని కాపాడాలని, కోరుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై స్పందించిన పవన్.. సీఎం జగన్‌కు ప్రత్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అన్నారు.. భాష సరస్వతిని అవమానించకండి అంటూ సూచనలు చేశారు. కమ్మనైన అమ్మదనం కేవలం మాతృభాషలోనే లభిస్తుందని, దానిని బావితరాలకు దూరం చేయడం వల్ల.. తెలుగు బాష ఉనికికే ప్రమాదమని పవన్ కల్యాణ్ పేర్కోన్నారు.

‘ఇంగ్లీషు భాషని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ.. తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే.. మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది. జగన్ రెడ్డి గారు.. మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు.. తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు. జగన్ రెడ్డి గారు భాష సరస్వతిని అవమానించకండి’ అంటూ వరుసగా ట్వీట్‌లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles