10th Class Student Kidnaps 7-Year-Old Kid ఏడేళ్ల బాలుడ్ని కిడ్నాప్ కేసులో నిందితుడెవరో తెలుసా.?

10th class student kidnaps 7 year old kid at hyderabad

10th class student, 7 yrs old, abduction, kidnap, Rs 3lakhs, TSR colony, Meerpet, Hyderabad Police, Telangana, crime

In a shocking incident, a 10th class student abducted 7 year old kid who was playing in front of their house. The incident took place in TSR colony, Meerpet, Hyderabad. Later, the kidnapper called the father of the kid and demanded a ransom of Rs. 3 lakh.

ITEMVIDEOS: ఏడేళ్ల బాలుడ్ని కిడ్నాప్ కేసులో నిందితుడెవరో తెలుసా.?

Posted: 11/18/2019 05:35 PM IST
10th class student kidnaps 7 year old kid at hyderabad

అభంశుభం తెలియని అమాయక బాలల్లో నేర స్వభావం ఎలా పెరుగుతుందన్న విషయాన్ని వెల్లడిస్తోందీ ఈ ఘటన. నేరమే వృత్తి, ప్రవృత్తి అంటూ దానినే అలవర్చుకుంటున్న హైదరాబాద్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాలు, సీరియళ్లతో పాటు సమాజంలో జరుగుతున్న నేరాల ప్రభావం చిన్నారి హృదయాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిపే ఘటన ఇది. దేశ భావితరాలపై తమ నేరాల ప్రభావం ఎంతలా అకర్షిస్తుందో.. అనేందుకు ఈ ఘటన పరాకాష్ట. నిండా పద్నాలుగేళ్లు కూడా నిండని ఓ చిన్నారి.. నేర ఘటనలకు అకర్షితుడై.. భవిష్యత్తును అంథకారం చేసుకున్నాడు.

ఆ బాలుడు వృద్దిలోకి వచ్చి తమ కలలను సాకారం చేస్తాడని, తమకు సమాజాంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప జేస్తాడని ఎన్నో ఆశలతో కలల సౌధాన్ని నిర్మించుకున్న బాలుడి తల్లిదండ్రుల ఆశలన్నీ పేకమేడలా కుప్పకూలిపోయాయి. పదో తరగతి చదువుతున్న తమ బిడ్డ చేసిన పనికి సమాజంలో తమకు కూడా స్థానం లేదని లోలోన కుమిలిపోతున్న వారి బాధ వర్ణణాతీతం. ఇంతటి వ్యధను అనుభవించడానికి అసలేం జరిగిందంటే.. పద్నాలుగేళ్ల పదో తరగతి విద్యార్థి వక్రమార్గం పట్టి.. నేరాలకు అకర్షితుడై.. ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.3లక్షలు డిమాండ్ చేశాడు. బాలుడి తండ్రి పిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు 3 గంటల వ్యవధిలో కేనును చేధించారు.

ఈ మొత్తం ఘటన వెనుకనున్న పదో తరగతి విద్యార్థేనా.? లేక మరెవరి ప్రమేయమైనా వుందా.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, మీర్ పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజ్ కుమార్ తన భార్య, కొడుకు అర్జున్(7)తో కలిసి మీర్ పేటలోని టీఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అర్జున్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. కొద్దిసేపటికీ తమ బిడ్డ ఇంట్లోకి రాకుండా ఎక్కడకెళ్లాడా.? అని కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు.

అదే సమయంలో రాజ్ కుమార్ ఓ నంబర్ ను నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.3లక్షలిస్తేనే వదిలిపెడతాం’ అంటూ అవతలి వ్యక్తి చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో ఆందోళనపడిన రాజ్ కుమార్ వెంటనే మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈలోగా ఆ కిడ్నాపర్ మళ్లీ రాజ్ కుమార్ కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. అతని కాల్ ను ట్రేస్ చేసిన పోలీసులు నిందితుడు వున్న ప్రాంతాన్ని గుర్తించారు. పోలీసుల బృందం ఆ ప్రాంతానికి చేరుకుని రాజ్ కుమార్ బిడ్డను కాపాడింది.

అయితే ఏడేళ్ల చిన్నారి పక్కనున్న కిడ్నాపర్ ను చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. నిందితుడు ఏ కరడుగట్టిన నేరస్థుడో కాదు... పదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని పట్టుకుని జీపులో ఎక్కించారు. అయితే ఈ కిడ్నాప్ వెనుక ఇంకెవరి హస్తమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ యాదయ్య తెలిపారు. కాగా, ఈ బాలనేరస్థుడిపై గతంలో ఓ దొంగతనం కేసు కూడా నమోదయ్యిందని సమాచారం. కనీసం ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాతైనా బాలనేరస్థుడి ప్రవర్తనపై అతని తల్లిదండ్రులు నిఘా పెట్టకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10th class student  7 yrs old  abduction  kidnap  Rs 3lakhs  TSR colony  Meerpet  Hyderabad Police  Telangana  crime  

Other Articles