Gold amnesty scheme might be announced soon పసిడిపై పన్ను..? దేశప్రజలపై ప్రధాని మరో సర్జికల్ స్ట్రైక్.?

Government may roll out amnesty scheme for unaccounted gold

gold, gold amnesty scheme, silver, gold black money, PM Modi, yellow metal, gold amnesty scheme, IDs, Tax, black money, gold tax, gold income tax

The government may soon announce an amnesty scheme for gold to bring hordes of black money used in buying the yellow metal considered a safe investment option in India. According to sources, the new amnesty scheme would allow gold hoarders to come clean on investment made using black money by declaring their possession and paying tax on it.

పసిడిపై పన్ను..? దేశప్రజలపై ప్రధాని మరో సర్జికల్ స్ట్రైక్.?

Posted: 10/30/2019 06:55 PM IST
Government may roll out amnesty scheme for unaccounted gold

దేశంలో సగానికిపైగా చలామణిలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం మరో సాహసోపేత నిర్ణయం తీసుకోబోతోందా..? దేశంలో మరో రూపంలో పేరుకుపోయిన నల్లధనంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయనున్నారా.? అంటే తాజావార్తలు ఔననే సంకేతాలనే ఇస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇక పసిడి పని పట్టేందుకు రెడీ అయ్యిందా.? కేంద్ర బంగారు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైన పక్షంలో నల్లధన నిర్మూలనకు మోడీ సర్కార్ తీసుకునే రెండో అతిపెద్ద నిర్ణయంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

నల్లధన నిర్మూలన, అవినీతికి చెక్ పెట్టేలా కేంద్రంలోని బీజేపి నేతృత్వంలో గల ఎన్డీఏ ప్రభుత్వం 2016లో నవంబర్ 8న తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) తీసుకున్న విషయం తెలిసిందే. కాగా అదే ప్రభుత్వం వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తరువాత అదే నల్లధనంపై మరోమారు యుద్దం ప్రకటించనుంది. అయితే నల్లధనం బంగారం రూపంలో వున్న నేపథ్యంలో ఈ యుద్దం మరింత కఠినంగా వుండనున్నట్లు సమాచారం. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో భారత్ ఉన్న తరుణంలో ఇది నిజంగానే హాట్‌ టాపిక్ గా మారనుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేశంలో రశీదు లేని బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలకు ఉపక్రమించింది. దేశీయ వినియోగదారుల వద్ద వుండే బంగారంనిల్వపై పరిమితిని విధించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రత్యేకంగా గోల్డ్‌ బోర్డును ఏర్పాటు చేయనుంది. దీని ప్రకారం ఎవరి వద్ద ఎంత బంగారం వుందో తెలుసుకోవడం కేంద్రానికి సులభంగా మారనుంది. అయితే పరిమితికి మించి ఎక్కువ బంగారాన్ని కలిగి వుంటే జరిమానా, నిర్దేశిక పన్నును చెల్లించాల్సి వుంటుంది.

అయితే పసిడి వివరాలను తెలియజేయకపోతే ఏం జరుగుతుంది.? అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్న ఈ తరుణంలో ఇది సరిగ్గా నోట్ల రద్దుకు ముందు ఉత్పన్నమైన పరిస్థితులను గుర్తు చేస్తోంది. అదెలా అంటే గతంలో ఆదాయ పన్ను అమ్నెస్టీ స్కీమ్ ప్రకటించిన తరువాత కొంతకాలం వరకు అందుబాటులో వుంది. ఆ తరువాత నోట్ల రద్దు ప్రక్రియ జరిగింది. సరిగ్గా అలానే ఈ సారి బంగారం అమ్నెస్టీ స్కీమ్ రానుంది. ఇది కూడా కొంత కాలం పాటు అందుబాటులో వుంటుంది. ఈ సమయంలో తమ వద్దనున్న రశీదు రహిత బంగారం వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి వుంటుంది. స్కీమ్ ముగిసిన తరువాత రశీదు రహిత బంగారం బయటపడితే కఠినచర్యలు తప్పవన్న అంచనాలున్నాయి.

అయితే అమ్నెస్టీకి సంబంధించిన విధి, విధానాలపై అధికారంగా పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయినప్పటికీ.. బంగారం బోర్డు ఏర్పాటు, అమ్నెస్టీ స్కీమ్ వార్తలు మాత్రం తీవ్ర చర్చకు, ఆందోళనకు దారి తీస్తోంది. అయితే ఇలా చేస్తే పసిడి ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తుందా.? అన్న అనుమానాలు కూడా వున్నాయి. అయితే ఇప్పటికే ఆకాశన్నంటున్న కుందనం ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల కన్నా అధికంగా వున్న పసిడి ధరలు కూడా ఈ ప్రక్రియ తరువాత అందుకనుగూణంగా కొనసాగవచ్చునన్న వార్తలు వినిపిస్తున్నాయి.

బంగారం బోర్డు ఏర్పాటు నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీరి వద్ద పరిమితికి మించి బంగారం వుంటే, ఆ మిగిలినదంతా ప్రభుత్వం లాగేసుకుంటుందా? బంగారం పరిమితిని ప్రభుత్వం ఎలా లెక్కిస్తారు? బంగారం ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం అడిగినప్పుడు వివరణ ఇస్తే సరిపోతుందా? వారసత్వంగానో, పుట్టింటినుంచో, బహుమతిగానో, స్త్రీధనంగానో తెచ్చుకున్న బంగారానికి రశీదులు ఎవరిస్తారు.? రశీదు లేని బంగారం ఎంత మేరకు ఉండవచ్చు.. ఎంత రశీదు లేని బంగారానికి ఎంత మేరకు పన్ను విధిస్తారు.? గతంలో కేంద్రం చెప్పిన లెక్కలే ఫైనలా.? లేక పరిమితి పెంచుతారా.? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే వీటిన్నిటికి  సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  PM Modi  yellow metal  gold amnesty scheme  IDs  Tax  black money  

Other Articles