Veteran actress Geetanjali passes away సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

Senior actress and veteran heroine geetanjali breathes her last in hyderabad

senior actress geethanjali passed away, veteran heroine geetanjali, ntr, Geethanjali, geetanjali, actress, Kakinada, Geethanjali RamaKrishna, that is mahalakshmi, Seetharama Kalyanam, Apollo hospital, Hyderabad, Andhra pradesh, Crime

Senior actress and veteran heroine Geetanjali passed away on Thursday due to cardiac arrest. While undergoing treatment, she breathed her last at a private hospital in Hyderabad. In an illustrious career spanning for close to six decades, Geetanjali featured in over 500 films across multiple languages like Telugu, Tamil, Malayalam, and Hindi.

సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ గీతాంజలి కన్నుమూత

Posted: 10/31/2019 10:02 AM IST
Senior actress and veteran heroine geetanjali breathes her last in hyderabad

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ గీతాంజలి రామకృష్ణ ఇవాళ ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌ ఫిలింనగర్ లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి.. ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో రూపోందిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారామె.

తెలుగు ప్రేక్షకులు అమె నటనకు మంత్రముగ్ధులయ్యారంటే అతిశయోక్తి కాదు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం సీతారాముల కళ్యాణంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె సీనియర్ నటులు ఎన్టీఆర్‌, ఎఎన్నార్, జగయ్య, కృష్ణ తదితర నటులకు పోటీగా నటించి మెప్పించారు. 1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి.. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత చాలాకాలం పాటు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె.. ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా చిత్రసీమలోకి అడుగుపెట్టి తన సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. రెండో ఇన్నింగ్స్ లో అమెకు చెప్పకోదగ్గ అవకాశాలు లభించాయి. మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మి.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మించిన ఆమె కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు విద్యాబాసం చేశారు. ఐదేళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. ఆరో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. 1963లో పారస్‌మణి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు. గీతాంజలి మృతి విషయం తెలిసి టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. చాలామంది ప్రముఖులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles