RTC to organise Karthika Masam tours from November 2 కార్తీకంలో ప్రత్యేకం.. శైవక్షేత్ర దర్శనాలకు ఆర్టీసీ బస్సులు.!

Rtc to organise karthika masam tours from november 2

Kartika Masam, Kartika Masam Vana Bhojanalu, Kartika Masam Shivaradhana, Amavasya, Srisailam devotees, Srikalahasti devotees, Kaleshwaram devotees, Srisailam, Srikalahasti, Kaleshwaram, Tourism, Telangana, Andhra Pradesh, Politics

The APSRTC is organising ‘Pancharamalu’ and ‘Trilinga Darshini’ tours for devotees during ‘Karthika Masam’. The tours will begin from November 2. The corporation will arrange darshan of Pancharama temples located at Amaravati, Bhimavaram, Draksharamam, Palakole and Samarlakota. Buses will begin from Pandit Nehru Bus Station (PNBS)

కార్తీకంలో ప్రత్యేకం.. శైవక్షేత్ర దర్శనాలకు ఆర్టీసీ బస్సులు.!

Posted: 10/30/2019 05:25 PM IST
Rtc to organise karthika masam tours from november 2

ఆశ్వయుజ మాసంతో పండుగ వాతావరణం అలుముకునే తెలుగురాష్ట్రాల్లో.. కార్తీకం రాకతో ఆథ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఇటు శైవక్షేత్రాలతో పాటు అటు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఆలయం చూసినా.. పుణ్యతీర్థాలు సందర్శించినా, ఫుణ్యక్షేత్రాలు వెళ్లినా హరినామస్మరణ మార్మోగిపోతుంది. హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన మాసాల్లో కార్తీక మాసం చెప్పుకోదగినది. హరహరులిద్దరికీ ఈ మాసంలో ప్రత్యెక పూజాదికాలు నిర్వహిస్తారు. భక్త జనకోటి ఈ పూజాదికాల్లో పాల్గొని తదాత్మ్యత చెందుతారు.

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఫుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తుంటారు. అయితే వారికోసం ఏపీఎస్ అర్టీసీ కూడా ఓ అడుగుముందుకేసీ భక్తజనకోటిని పంచారామ క్షేత్రాలతో పాటు త్రిలింగ దర్శనాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఏపీఎస్‌ ఆర్టీసీ భక్తులకు శైవక్షేత్రాల దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు ఐదు పంచారామాల్లోని వెలసిన శివుని దర్శనం చేసుకోనేలా ప్యాకేజీ ప్రకటించింది. కృష్ణా రీజియన్‌ పరిధిలోని నవంబర్‌ 2వ తేదీ నుంచి 13 రోజుల పాటు భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు తిప్పునున్నారు.  

ఐదు పంచారామాలకు బస్సులు
అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని పంచా రామాల శైవక్షేత్రాల్లో వెలసిన శివుని దర్శనం చేసుకొనేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మాసంలోని ప్రతి శనివారం, ఆదివారం, సోమవారాల్లో పాటు ముఖ్యమైన రోజుల్లో ఈసదుపాయం కలిగేవిధంగా నవంబర్‌ 2,3,4,9,10, 11, 16,17,18,23,24,25 తేదీలు నిర్ధారించారు. ఈమేరకు విజయవాడ నుంచి ఆటోనగర్‌ టెర్మినల్, పండిట్‌నెహ్రూ బస్టాండ్‌ నుంచి ఉదయం 3 నుంచి 4 గంటల వ్యవధిలో బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ సర్వీసులు నడుపుతున్నట్లు జయరావు తెలిపారు.

టికెట్ రిజర్వేషన్ ఇలా:
ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ముందుగా ఆర్టీసీ బస్ స్టేషన్ లో, ఆథరైజ్డ్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సెంటర్లలో రిజర్వేషన్‌ చేయించుకోవాలని అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి పంచారామాలలోని శైవక్షేత్రాలకు సూపర్‌లగ్జరీ టిక్కెట్‌ పెద్దలకు రూ.880 , పిల్లలకు రూ.660 వరకు నిర్ణయించారు. అలాగే అల్ట్రా డీలక్స్‌లో పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.630 వరకు చెల్లించాల్సి ఉందని ఆర్‌ఎం జి.నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

త్రిలింగ దర్శిని
యాగంటిలో కొలువైఉన్న శ్రీఉమామహేశ్వర స్వామిని దర్శనం, శ్రీశైలంలోని శ్రీమల్లిఖార్జున స్వామి వారి, వాటితోపాటు మహానందిలోని స్వామి వారిని దర్శించుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేశారు. సూపర్‌ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేయగా పెద్దలకు రూ.1430, పిల్లలకు రూ.1080 కేటాయించారు. త్రిలింగదర్శిని కోసం ఏర్పాటు చేసిన సర్వీసులు శనివారం రాత్రి గం.8.00 బయల్దేరి తిరిగి సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌కు చేరుతాయి. మరింత సమచారం కోసం ఫోన్‌ నెంబరులో 8074298487 సంప్రదించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles