YCP MLA comments puts Jagan Sarkar in trouble ఇసుక విధానంపై సొంతపార్టీని ఇరుకున బెట్టిన వైసీపీ ఎమ్మెల్యే..

Ycp mla sensational comments on his own party sand policy misuse

AP Chief Minister, AP CM YS Jagan, YS JaganMohanReddy, sand policy, kakani, party leaders, Nellore rural MLA, Andhra Pradesh, Politics

Andhra Pradesh ruling party YSRCP MLA from nellore rural made sensational comments on misuse of his own party sand policy, which gives boast to opposition parties allegations and puts YCP party Chief and AP CM YS Jagan in trouble.

ఇసుక విధానంపై వైసీపీని ఇరుకున బెట్టిన సొంతపార్టీ ఎమ్మెల్యే..

Posted: 10/25/2019 12:24 PM IST
Ycp mla sensational comments on his own party sand policy misuse

రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెట్టేలా ఓ వైపు టీడీపీ నేతలు వారికి అందివచ్చే ప్రతివిషయంపై విమర్శలు చేస్తున్న క్రమంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా తాజాగా వారికి స్వరం కలిపారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ ప్రభుత్వం అసుసరిస్తున్న ఇసుక విధానంపై విమర్శలు చేశారు. ఇప్పటికే ప్రతిపక్షంతో పాటు రాష్ట్రంలోని పలువురు ఇసుక విధానంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారికి గొంతుకలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని.. కూలీలు పస్తులు వుంటున్నారని విమర్శలు వినిపిస్తున్న క్రమంలో.. ఇసుక కొరతపై కోటంరెడ్డి స్పందించారు. ప్రభుత్వ విధివిధానాలను పక్కనపెడుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా ఇసుక పాలసీ విధానాన్ని తమ సొంతానికి, అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సామాన్యుడికి ఇసుక అందని రీతిలో దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్, నగర ప్రజల ఇక్కట్లు, భవన నిర్మాణ కార్మికుల బాధల్ని తీర్చేందుకు ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన అన్నారు.

నెల్లూరు రూరల్, నగర ప్రజల ఇక్కట్లు, భవన నిర్మాణ కార్మికుల బాధల్ని గమనించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయితే కోటంరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాణి మధ్య కొద్దిరోజుల క్రితం విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో... ప్రస్తుతం కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకాణి టార్గెట్ గానే చేసి ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles