Huzurnagar bypoll result: BJP losses deposit ‘‘వార్డు మెంబర్ కు వచ్చిన ఓట్లు కూడా ఆ అభ్యర్థికి రాలేదు’’

Talasani critisizes bjp in satirical manner after losing deposit at huzurnagar

bypoll results, election results 2019, Talasani Srinivas Yadav, BJP candidate, satirical comment, Huzurnagar by-elections, Telengana bypoll results, TRS, congress, Huzurnagar bypoll result, saidi reddy, padmavati, huzurnagar, by-election, TRS, congress, Telangana, politics

Ruling TRS candidate S Saidi Reddy has taken huge lead in the bye-elections to Huzurnagar Assembly constituency. In this context Minister Talasani Srinivas Yadav critisized BJP in satirical manner. He stated the BJP MLA candidate havn't recieved votes of that of ward member.

‘‘వార్డు మెంబర్ కు వచ్చిన ఓట్లు కూడా ఆ అభ్యర్థికి రాలేదు’’

Posted: 10/25/2019 01:07 PM IST
Talasani critisizes bjp in satirical manner after losing deposit at huzurnagar

యావత్తు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన హుజూర్‌నగర్ ఉప-ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి రికార్డు బ్రేక్ చేస్తూ.. 43 వేల ఓట్ల పైచిలుకుతో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీ అభ్యర్థి సహా.. టీడీపీ పార్టీ అభ్యర్థులకు కూడా డిఫాజిట్లు గల్లంతయ్యాయి. ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూర్ నగర్ ను తమ కంచుకోటగా మార్చుకునేందుకు నాంది పలికింది.

ఈ క్రమంలో హుజూర్ నగర్ ప్రజలు తీర్పును స్వాగతించిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ గెలుపు ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసానికి, నమ్మకానికి ప్రతిభింభించాయని అన్నారు. కాగా ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు ఒక గుణపాఠమని అన్నారాయన. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలను మానుకోవాలని సూచించారు. లేని పక్షంలో ప్రతిపక్షాలను కూడా ప్రజలు మర్చిపోయే రోజులు వస్తాయని అన్నారు. ప్రతిపక్షాలు మీడియా ముందు అరవడం కన్నా.. ప్రజల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీపై మంత్రి తలసాని తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. ఓ వార్డు సభ్యుడికి వచ్చిన ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మీడియాను ముందు ఫసలేని విమర్శలు చేస్తూ.. అరిచిన అరుపులకు ప్రజలే ఓట్లతో వారి విమర్శలను తిప్పికొట్టారని అన్నారు. ప్రభుత్వ పనితీరుకు హుజూర్ నగర్ ఫలితాలు ఒక నిదర్శనమని అన్నారు. ఆరు దశాబ్దాలలో జరగని అభివృద్ధి గడిచిన 5 సంవత్సరాలలో జరిగిందని తలసాని వ్యాఖ్యానించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles