HC deadline to Jagan Govt on Capital రాజధాని నిర్మాణంలో జాప్యం.. హైకోర్టు ఆగ్రహం..

What s your stand on capital hc questions jagan sarkar

AP Chief Minister, AP CM YS Jagan, YS JaganMohanReddy, Chief Justice JK Maheshwari, HIgh court, Amaravati, Swiss Challenge, Infrastucture, Andhra Pradesh, Politics

AP Chief Justice JK Maheshwari is taking a very serious view of the Jaganmohan Reddy government’s policies on Capital construction. Tthe High Court issued a 2-week deadline to AP Circar to clarify on its agenda on Capital and also Swiss Challenge method.

రాజధాని నిర్మాణంలో జాప్యం.. జగన్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం..

Posted: 10/25/2019 11:32 AM IST
What s your stand on capital hc questions jagan sarkar

నవ్యాంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం శరవేగంగా జరగాల్సిన తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో జాప్యం జరగడం.. అసలు నిర్మాణం పూర్తవుతుందా.? లేదా అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్న క్రమంలో.. నిర్మాణం కోసం తమ స్వస్థలాలను వదిలి ఇక్కడకు వచ్చిన అనేక మంది పస్తులు వుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు రాజధాని అవమరావతి నిర్మాణం జరుగుతుందా.? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజధాని తరలింపు విషయమై అనేక ఊహాగానాలు రావడంతో పాటు.. అవరావతే రాజధాని అని పాలక పక్షంలోని కొందరు.. కాదని కూడా మరికొందరు వ్యాఖ్యలతో సందిగ్ధత ఏర్పడింది.

ఈ క్రమంలో రాజధాని అమరావతిపై, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని అభిప్రాయపడింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రుల ఎజెండాలతో తమకు పని లేదని, చట్టంతో మాత్రమే తమకు సంబంధమని స్పష్టం చేసింది. ఏపీఐడీఈ చట్టం-2001కి సవరణ చేస్తూ 2017 ఏప్రిల్‌ 19న ఏపీ న్యాయశాఖ కార్యదర్శి తీసుకొచ్చిన ‘సవరణ చట్టం-3/2017ను సవాలు చేస్తూ ‘ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ’ సభ్యులు వై.సూర్యనారాయణమూర్తి రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

దీనికి తోడు రాజధాని అమరావతి స్టార్టప్‌ ప్రాంతం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలు ‘స్విస్‌ ఛాలెంజ్‌’ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసినవని, రాజధాని నిర్మాణానికి సంబంధించినవి కావని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన గల ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఈ వ్యాజ్యాల్ని రాజధాని నిర్మాణ విషయానికి విస్తరిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు వద్ద కప్పు టీ కూడా దొరకడం లేదని ఆక్షేపించింది. పలు సమస్యలున్నాయని, వాటిని తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పేర్కొంది. 2 వారాల్లో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. మరోసారి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. న్యాయ పరిపాలన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన మధ్యంతర ఉత్తర్వులిస్తామని పేర్కొంది. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM YS Jagan  Chief Justice JK Maheshwari  HIgh court  Amaravati  Andhra Pradesh  Politics  

Other Articles