Telangana sets 6 PM deadline for TSRTC employees సమ్మెపై సర్కార్ సీరియస్.. వెనక్కు తగ్గమన్న కార్మికసంఘాలు

Telangana sets 6 pm deadline for tsrtc employees

TSRTC Workers gnore Govt warning, CM KCR Strong Warning To RTC, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Strong Warning To CM KCR, CM KCR, Warning To CM KCR, tsrtc workers strike, IAS committee tsrtc, face to face with tsrtc workers, tsrtc to merge in government, ts government

With the indefinite strike called by the employees of Telangana State Road Transport Corporation (TSRTC), the state government warned that all those who failed to report to duty by 6 p.m. on Saturday will lose their jobs.

సమ్మెపై సర్కార్ సీరియస్.. వెనక్కు తగ్గమన్న కార్మికసంఘాలు

Posted: 10/05/2019 12:03 PM IST
Telangana sets 6 pm deadline for tsrtc employees

తెలంగాణలో పెద్ద పండుగగా ఖ్యాతికెక్కిన దసరా పండగ వేళ తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమైన వేలాది మంది ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు చేరే దారి కనింపిచడం లేదు. కొందరు ప్రైవేటు ట్రావెల్స్ ను అశ్రయించగా, మరికోందరు ప్రయాణాలను నిలిపివేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకు కారణం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావమే. సమ్మెతో అర్టీసీ బస్సు సర్వీసులు స్తంభించిపోయాయి.. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి.

దీంతో.. ఆర్టీసీ సమ్మె విషయంలో సీరియస్ గానే వ్యవహరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన ఐఎఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది.

సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎంకు ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉందనే విషయాన్ని తెలిపినప్పటికీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు.

ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో, దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ఈ సమయంలోనే ఆర్టీసీకి నష్టం తెచ్చే విధంగా యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ప్రభుత్వం తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పారు.

అయితే, ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి, కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దని, తమ ఉద్యోగాలు తామే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని సిఎం స్పష్టం చేశారు. కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీ తరహాలో తమను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలన్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండుపై సీఎం కేసీఆర్ ఊసెత్తలేదని తెలుస్తోంది.

కాగా, ప్రభుత్వం హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు లెక్కపెట్టడం లేదు. సమ్మె విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆర్టీసీ కార్మిక సంఘాలు కుండబద్దలు కొట్టాయి. తమ న్యాయమైన డిమాండలను తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం పరిస్కరించాల్సిందేనని కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వం చర్చలు జరిపితేనే తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కార్మికులు డిమాండ్లను పరిస్కారంచలేని ప్రభుత్వం.. కార్మికల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నాలే హెచ్చరికలకు కారణమన్నారు.

ఆర్టీసీ కార్మికుల ఐక్యతను చూసి వణుకు పుట్టిన ప్రభుత్వం.. తాజా హెచ్చరికలతో తమ ఐకమత్యాన్ని బలహీనం చేయాలని భావిస్తోందని అన్నారు. ప్రభుత్వ హెచ్చరికలకు కార్మికులు భయపడొద్దని పిలుపునిచ్చారు.. అసలు వారు ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం.. ఇదే పోరాటాన్ని కార్మికులు కొనసాగించాలని కోరారు. ఇక, ప్రైవేట్ వాహనాలను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు అశ్వద్ధామరెడ్డి.. ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు జరుగుఆయన్న ఆయన.. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకే ప్రైవేట్ వాహనాలు పెడుతున్నారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Srike  TS Employees  CM KCR  IAS committee  Ashwathama Reddy  RTC Unions  RTC workers  Telangana  

Other Articles