Man arrested in Lalitha Jewellery robbery case ‘లలితా జువెలరీ’ దొంగ నుంచి 4.5కేజీల బంగారం స్వాధీనం

Man arrested in lalitha jewellery robbery case hunt on for others

lalitha jewellers theft in tiruchirappalli, 13.5 Kg Gold, Manikantan, Suresh, lalitha jewellers theft in tamil nadu, lalitha jewellers, lalitha jewellery theft, Chathiram bus Stand, Chathiram theft, tiruchirappalli theft, gold stolen, tamil nadu robbery, tamil nadu, crime

One person Manikandan (32), a resident of Tiruchirappalli, was arrested in connection with the robbery at a jewellery store in Tamil Nadu’s Tiruchirappalli district, where jewellery worth Rs 13 crore were stolen.

‘లలితా జువెలరీ’ దొంగ నుంచి 4.5కేజీల బంగారం స్వాధీనం

Posted: 10/05/2019 12:56 PM IST
Man arrested in lalitha jewellery robbery case hunt on for others

తమిళనాడు సహా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చోరి కేసులో తమిళనాడు పోలీసులు పురోగతి సాధించారు. తిరుచ్చిలోని లలితా జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఓ దొంగను పట్టుకున్నారు. దొంగతనం జరిగిన వారం రోజుల వ్వవధిలోనే ఓ దోంగ చిక్కడం పోలీసుల పనితీరుకు దర్పణం పడుతోంది. ఇద్దరి దొంగలు ఈ చోరి చేసినట్లు సిసిటీవీ కెమెరాలో చిక్కడంతో మరో దోంగతో పాటు అతని అనుచరుల కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

తమకు చిక్కిన దొంగ నుంచి 4.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లలితా జ్యువెలరీ నుంచి బుధవారం తెల్లవారుజామున రూ.13 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలను ఇద్దరు దొంగలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొందరు అనుమానితులను పుదుకోట్టైలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఓ దొంగ చిక్కాడని పోలీసులు తెలిపారు.

‘తిరువారూర్‌ సమీపంలోని విళమల్‌ అడియక్కమంగలం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సుమారు కిలోమీటరు దూరం వారిని వెంబడించగా అట్టపెట్టెతో సహా ఓ వ్యక్తి చిక్కాడు. పెట్టెలో నాలుగున్నర కిలోల బంగారు ఆభరణాలు కనిపించాయి. ఆ వ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడిందని’ తెలిపారు.

పట్టుబడిన నిందితుడు తిరువారూర్‌కు చెందిన మణికంఠన్‌(32)గా గుర్తించారు పోలీసులు. ఇతడు పాత నేరస్థుడేనని కూడా తెలిపారు. అయితే ఇంట భారీ చోరికి మాత్రం పాల్పడటం ఇదే తొలిసారని పోలీసులు పేర్కోన్నారు, గతంలో మణికంఠన్ ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డాడని కూడా పోలీసుల తెలిపారు. కాగా, పరారీలో ఉన్న వ్యక్తిని అదే గ్రామానికి చెందిన సురేష్‌గా పేర్కొన్నారు. వీరిద్దరూ చోరీకి పాల్పడిన తర్వాత నగలను పంచుకున్నారని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalitha jewellers  13.5 Kg Gold  Manikantan  Suresh  theft  tiruchirappalli  tamil nadu  crime  

Other Articles