Buses Go Off In Telangana As TSRTC Strike Begins తెలంగాణలో కొనసాగుతున్న అర్టీసీ కార్మికుల సమ్మె

Buses go off in telangana as tsrtc strike begins

TSRTC Workers Strong Warning To CM KCR, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Strong Warning To CM KCR, CM KCR, Warning To CM KCR, tsrtc workers strike, IAS committee tsrtc, face to face with tsrtc workers, tsrtc to merge in government, ts government

Hundreds of passengers were stranded at bus stations across the state and people travelling to their destinations for Dasara and Bathukamma festivals faced severe inconvenience as over 10,000 buses remained confined to the bus depots.

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న అర్టీసీ కార్మికుల సమ్మె

Posted: 10/05/2019 11:06 AM IST
Buses go off in telangana as tsrtc strike begins

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోలీసుల భద్రత నడుమ బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ప్రైవేట్‌ డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారు.

మరోవైపు బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు యత్నిస్తున్నాయి. దీంతో కార్మిక సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పలు చోట్ల కార్మికుల సమ్మెకు సంఘీభావంగా విపక్షాలు కూడా ధర్నా చేస్తున్నాయి. పోలీసుల భద్రత నడుమ ప్రైవేట్‌ డ్రైవర్లతో పాక్షికంగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలోకి పోలీసులు ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన త్రిసభ్య ఐఏఎస్ కమిటీ కేసీఆర్ ను కలిసింది. గత మూడు రోజులుగా వారితో జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా తమను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలన్న డిమాండ్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తుంది.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలపై చర్చిస్తున్నారు. మూడు రోజులుగా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలపై సీఎంకు అధికారులు వివరిస్తున్నారు.  అన్ని కోణాల నుంచి చర్చించి ఈ రాత్రికి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం స్పందన పట్ల కార్మిక సంఘాలు ఉత్కంఠగా ఎదురుచూస్తూనే.. మరోవైపు ఈ క్రియాశీలకసమయంలో తాము ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కు తగ్గకూడదనే నిర్ణయించుకున్నాయి. మరోపక్క టీఎస్ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు ఏపీఎస్సార్టీసీ ఈయూ నేతలు తమ మద్దతు ప్రకటించారు. టీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, వీరికి మద్దతుగా అవసరమైతే ఏపీలో కూడా ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని ఈయూ నేతలు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tsrtc  Srike  TS Employees  CM KCR  IAS committee  TSRTC demands  TS government  

Other Articles