devineni uma sensational comments on AP govt రివర్స్ టెండరింగ్ పై దేవినేని సంచలన వ్యాఖ్యలు

Devineni uma sensational comments on reverse tendering

devineni uma sensational comments, suspense on polavaram reverse tendering, former minister devineni uma sensational comments, devineni uma maheshwar rao, polavaram project, CM Jagan, Reverse Tendering, AP Government

devineni uma sensational comments on Andhra Pradesh government, says suspense continues on reverse tendering of polavaram project head works

పోలవరం రివర్స్ టెండరింగ్ పై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

Posted: 09/23/2019 09:58 PM IST
Devineni uma sensational comments on reverse tendering

ఆంధ్రప్రదేవ్ లోని కొత్త ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిర్వహించిన రివర్స్ టెండర్లతో కొత్త అనుమానాలు రేగుతున్నాయి. హెడ్‌వర్క్స్, హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఒకే ప్యాకేజీగా నిర్ణయించి రూ.4,987 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎల్ 1 గా కంపెనీ కోట్ చేసిన ధరనే అంచనా వ్యయంగా నిర్ధారించి టెండర్లు ఆహ్వానించింది.

టెండర్లలో 12.6 శాతం తక్కువకు అంటే రూ.4,358 కోట్లకు ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ మెఘా టెండర్ దాఖలు చేసింది. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.628 కోట్లు ఆదా అయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తరువాతే పెద్ద చిక్కు వచ్చి పడింది. తొలుత మొత్తం 8 సంస్థలు కాంట్రాక్ట్‌పై ఆసక్తి చూపినప్పటికీ చివరికి మెఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. మిగిలిన 7 సంస్థలు తప్పుకున్నాయి. ఇప్పుడిదే ప్రభుత్వానికి సమస్యగా మారింది.

రివర్స్ టెండరింగ్‌ విధానం ప్రకారం కనీసం రెండు సంస్థలైనా బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ప్రభుత్వమే స్వయంగా విధించిన నిబంధన. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 అదే స్పష్టం చేస్తోంది. రివర్స్‌ టెండరింగ్‌లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలని అందులో ఉంది. దాని ప్రకారం ఒక్కటే బిడ్ దాఖలైంది కాబట్టి టెండర్ ఖరారు చేసేందుకు వీలుపడదని జలవనరుల నిపుణుల వాదన.

ఎవరూ రాని కారణంగా ఒక్కరికే కట్టబెడతారా? లేక నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలంటే కనీసం రెండు సంస్థలైనా బిడ్‌లు దాఖలు చేసి ఉండాలి. అలాగైతేనే ఒక సంస్థ ఎల్‌-1గా నిలిస్తే.. మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ నిబంధనలైతే సవరణలకు అవకాశం ఉండేది. ఇదే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విధానం కావడంతో సదరు నిబంధనలను పాటిస్తారో.. లైట్ తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles