child rights association fires on garikapati గరికపాటిపై బాలల హక్కుల సంఘం ఫైర్.!

Child rights association achutha rao fires on garikapati narasimha rao

Garikipati Narasimha Rao, Telugu Avadhani, literary performer, Child rights association, Achutha Rao, apology

Garikipati Narasimha Rao is a Telugu Avadhani (literary performer) comments on punishing students became controvesial. Child rights association Achutha Rao demands unconditional apology from him.

గరికిపాటి బేషరతు క్షమాపణలు చెప్పాలి: బాలల హక్కుల సంఘం

Posted: 09/24/2019 10:12 AM IST
Child rights association achutha rao fires on garikapati narasimha rao

దండం దశ గుణమ్ భవేత్ అంటూ.. మొక్కై వంగనిది మ్రానే వంగునా అన్న చందంగా.. బాల్యవ్యవస్థలో పిల్లలు వక్రమార్గంలో నడుస్తున్నట్లు తమ దృష్టికి వస్తే అప్పుడే నాలుగు తిట్టే.. లేక ఒక్కటి కోట్టో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని సక్రమ మార్గంలో నడిపించాలని ప్రముఖ ప్రవచనకర్త, అవధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.

గరికపాటి వ్యాఖ్యలపై తాజాగా బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పిల్లలను కొట్టడం తప్పుకాదని, దానిని తల్లిదండ్రులు ప్రశ్నించడం సరికాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బాలల హక్కుల సంఘం తప్పబట్టింది. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని హింసించే ఉపాధ్యాయులకు గరికపాటి వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

గరికపాటి తన ప్రవచనాల ద్వారా పిల్లలకు మనోభావాలు ఉండవని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు పిల్లలను అయినదానికీ, కానిదానికీ హింసించే టీచర్లకు మరింత బలం ఇచ్చేలా ఉన్నాయని ఆరోపించారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని పిల్లలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. కాగా, ఇటీవల గరికపాటి ప్రవచనం చెబుతూ పిల్లలను టీచర్ కొడితే తప్పులేదని, ఆయన కొట్టారని ఇంట్లో చెబితే తల్లిదండ్రులు మళ్లీ దండించాలి తప్పితే ఉపాధ్యాయులను ప్రశ్నించడం సరికాదని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles