SC ST atrocity case filed against Chintamaneni Prabhakar చింతమనేనిపై అట్రాసిటీ కేసు... అజ్ఞాతంలో ప్రభాకర్?

Sc st atrocity case filed against chintamaneni prabhakar

TDP leader Chintamaneni Prabhakar, Dendulur former MLA Chintamaneni Prabhakar, Chintamaneni Prabhakar abusing SC caste youth, Chintamaneni Prabhakar abused SC in the name of caste, Chintamaneni Prabhakar sand issue, Chintamaneni Prabhakar House Arrest, Chintamaneni Prabhakar Pinakadimi village, Chintamaneni Prabhakar, Pedavegi Mandal, Chintamaneni Prabhakar dendulur, Chintamaneni Prabhakar West Godavari, Andrha Pradesh, Crime

TDP leader and former MLA Chintamaneni Prabhakar has once again made the news for a wrong reason. It is alleged that former TDP MLA has abused the locals for taking sand from Pinakadimi village in Pedavegi Mandal of West Godavari district in the name of caste.

చింతమనేనిపై అట్రాసిటీ కేసు... అజ్ఞాతంలో ప్రభాకర్?

Posted: 08/30/2019 02:58 PM IST
Sc st atrocity case filed against chintamaneni prabhakar

ప్రభుత్వ అధికారుల విధులకు అటంకం కలిగించి.. వారిని తీవ్ర పదజాలంతో దూషించిన కేసులో ఇప్పటికే టీడీపీ నేత కూన రవికుమార్ పై కేసు నమోదు కాగా, తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ శాసనసభ్యుడు... వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దళితుల్ని కులం పేరుతో దూషించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటు ఆయన అనుచరులు కొందరిపై... ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పెదవేగి పోలీసులు తెలిపారు.

ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించాడని, ఆయన ఆనుచరులు ఆయన సమక్షంలోనే తమపై దాడికి కూడా పాల్పడ్డారని గ్రామస్థులు పోలీసులకు పిర్యాదు చేశారు. అంతేకాదు "తాను తప్ప ఎవరూ మట్టి తోలేందుకు వీలు లేదని" ఆర్డర్ వేసిన చింతమనేని... ఎదరుతిరిగిన వారిపై దాడి చేశారని బాధితులు తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏలూరు ఫైర్ స్టేషన్ కూడలిలో ఎస్సీలు ఆందోళన చేశారు. వెంటనే చింతమనేని ప్రభాకర్‌నీ, ఆయన అనుచరులనూ అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

అయితే అంతకుముందే ఇసుక కొరతపై ధర్నాకు బయల్దేరిన చింతమనేనిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభాకర్ ను హౌస్ అరెస్ట్ చేయడంతో.. ఆయన ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్షపూరితంగా ఆయనపై కేసులు పెడుతున్నారని.. ధర్నాకు వెళ్లనివ్వడం లేదని ఆందోళనకు దిగారు. అటు బాధితులు కూడా ధర్నాకు దిగడంతో ఏ క్షణమైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chintamaneni Prabhakar  TDP  SC attrocity case  sand  Pinakadimi  Pedavegi  West Godavari  Andhra Pradesh  Crime  

Other Articles