NBW issued against Renuka Chowdhury రేణుకా చౌదరిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారంట్!

Non bailable arrest warrant issued against renuka chowdhury

Renuka Chowdhury, wyra assembly constituency, Ramji naik, Kalavathi, Khammam court, non bailable warrant, cheating case, Telanganga, Crime

Khammam court issues Non Bailable Arrest Warrant against Congress leader and former Union Minister Renuka Chowdhury for not taking court warrents and not attending to court.

రేణుకా చౌదరిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారంట్!

Posted: 08/30/2019 01:02 PM IST
Non bailable arrest warrant issued against renuka chowdhury

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. న్యాయస్థానం జారీ చేసిన వారెంట్లను తీసుకోవడంతో విముఖత వ్యక్తం చేసిన ఆమె చివరకు న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకు కూడా నిరాసక్తత ప్రదర్శించడంతో అమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. నాయకురాలు అయినంత మాత్రన న్యాయస్థానం జారీ చేసిన వారెంట్లను తీసుకోకపోవడం, న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఖమ్మంలోని జిల్లా న్యాయస్థానంలోని రెండవ ఆదనవు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అమెపై ఎన్బీడబ్యూ వారెంట్లను జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయి నాయకురాలైన అమె గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి తమను మోసం చేసిందని వైరా కాంగ్రెస్ నాయకుడు రాంజీ నాయక్ సతీమణి కళావతి అరోపించారు. వైరా టికెట్ తప్పకుండా వస్తుందని ఆశపెట్టిన ఆమె తమ వద్ద రూ.కోటి 30లక్షలు తీసుకున్నారని కళావతి ఆరోపించింది.

ఆ ఎన్నికల సమయంలో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. ఎన్నికల్లో తన భర్తకు సీటు ఇప్పిస్తానంటూ రేణుక మోసం చేసిందని ఆమెపై కళావతి చీటింగ్ కేసు పెట్టారు. అయితే, కోర్టు నుంచి నోటీసులు వచ్చినా రేణుకా చౌదరి వాటిని తీసుకోలేదు. కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాలేదు. దీంతో ఆమెపై ఖమ్మం జిల్లా రెండవ ఆదనవు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renuka Chowdhury  Ramji naik  Kalavathi  Khammam court  non bailable warrant  Crime  

Other Articles