India to get 75 new medical colleges in next 3 years ‘‘75 కొత్త మెడికల్ కాలేజీలు.. 15 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు’’

Over 15 000 mbbs seats 75 new medical colleges centre embarks on biggest expansion

Union Minister Prakash Javadekar, prakash javadekar, health industry, health sector, modi government, medical colleges, Union Cabinet, MBBS, Doctors, Piyush Goyal

In a significant development for medical education aspirants, the central government has announced to set up as many as 75 new medical colleges that will be established in next 2-3 years, creating a mammoth 15,700 fresh MBBS seats.

75 కొత్త మెడికల్ కాలేజీలు.. 15 వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు: కేంద్ర క్యాబినెట్

Posted: 08/28/2019 07:50 PM IST
Over 15 000 mbbs seats 75 new medical colleges centre embarks on biggest expansion

దేశంలో కొత్తగా డెబ్బై ఐదు వైద్యకళాశాలలను నిర్మిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. 2021-22 లోగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తామని, తద్వారా 15,700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకూ వైద్యకళాశాలలు లేని చోట్లలో వీటిని నిర్మిస్తామని అన్నారు. ఈ సందర్భంగా చెరకు రైతుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, రూ.6 వేల కోట్ల ఎగుమతి రాయితీ ఇస్తామని ప్రకటించారు.

ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ నిర్ణయాలను మంత్రులు ప్రకాశ్ జవదేవకర్, పీయూష్ గోయల్ వివరిస్తూ.. రైతులను ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ చర్యలు చేపట్టిన ఫలితంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఆ రాయితీలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. తయారీ రంగం హబ్ గా భారత్ ను తీర్చిదిద్దుతున్నామని గోయల్ అన్నారు.

గతంలో విదేశీ మారక నిల్వలు సున్న స్థాయికి పడిపోయాయని, మోదీ హయాంలో వాటి నిల్వలు 280 మిలియన్ డాలర్లకు చేరాయని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, ఎఫ్ డీఐ నిబంధనలు సరళీకరించి పెట్టుబడులను పెంచామని చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని అన్నారు. ప్రింట్ మీడియాలోని 26 శాతం ఎఫ్ డీఐల అనుమతి డిజిటల్ మీడియాకు వర్తిస్తుందని, బొగ్గు గనుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు అనుమతించాలని తదితర నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles