Govt may announce package for J and K జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక నిధులు ప్రకటించనున్న కేంద్రం

Govt may announce package for setting up infra in jammu and kashmir

Constitution of India, Article 370, abrogate article 370, Article 35A, Jammu and Kashmir, Ravi Shankar Prasad, Aadhaar, Union Cabinet, PM Modi, Amit Shah, nation, Politics

The government may soon come out with a package worth crores of rupees to set up necessary infrastructure for implementing over 100 central laws in Jammu and Kashmir after abrogation of the special status to the state earlier this month.

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక నిధులు ప్రకటించనున్న కేంద్రం

Posted: 08/28/2019 06:57 PM IST
Govt may announce package for setting up infra in jammu and kashmir

జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన నేపథ్యంలో మోడీ సర్కార్ జమ్మూకాశ్మీర్ కు కొత్త కళను అద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక, ఆ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకం సహా అన్ని రంగాల్లో ఆ రాష్ట్రం అభివృద్ధి బాటలు పట్టించేందుకు 106కు పైగా కేంద్ర చట్టాల అమలుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రెడీ అవుతున్నారు.

వివిధ పథకాల అమలుకు రూ. వందల కోట్ల ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌ ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్ర సర్కారు.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. అక్టోబరు 31 నుంచి ఆ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనుంది. ఈ మధ్య సమయంలో కేంద్ర, రాష్ట్ర చట్టాలు అమల్లో ఉంటాయి. అక్టోబరు 31 నుంచి పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి మారేందుకు వీలుగా రూ.వందల కోట్లతో ఒక ప్యాకేజీని అందించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత వారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. కార్మిక, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, మానవ వనరుల అభివృద్ధి తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని ప్రాజెక్టులపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌ ఈఎస్‌ఐ చందాదారుల కోసం ఆస్పత్రి నిర్మించాలని, విద్యా హక్కు చట్టం అమలుకు, ఆధార్ చట్టం అమలుపై ప్రతిపాదనలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Article 370  Jammu and Kashmir  Ravi Shankar Prasad  PM Modi  Amit Shah  nation  Politics  

Other Articles