woman conned many men on matrimony site పెళ్లి పేరుతో 17 మందికి కిలేడీ టోకరా.. పోలీసుల అన్వేషణ

Tamil nadu police in search of conwoman cheating 17 men on matrimony site

matrimonial site, crime, scam, Shruthi, Mythili Venkatesh, Balamurugan, Coimbatore, Chitra, Chennai Police Commissioner, social media, Tamil Nadu, crime

Police are in seach of a gang including the young woman pretended to be a family and cheated men on matrimonial sites.

పెళ్లి పేరుతో 17 మందికి కిలేడీ టోకరా.. పోలీసుల అన్వేషణ

Posted: 05/31/2019 11:51 AM IST
Tamil nadu police in search of conwoman cheating 17 men on matrimony site

వివాహానికి సిద్ధమవుతున్న యువకులనే టార్గెట్గా చేసుకునే అమె.. అందులోనూ సంపన్నవర్గాలకు చెందిన యువకులను ట్రాప్ చేయడం.. ఆ తరువాత వారి నుంచి అందిన కాడికి దండుకోవడం.. ఇది కూడా చాలదన్నట్లు తీరా పెళ్లి సమయం వచ్చేసరికి బిచానా ఎత్తేయడం.. అమెకు వెన్నెతో పెట్టిన విద్య. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది అబ్బాయిలను పెళ్లి పేరుతో బురడీ కొట్టించిన ఈ యాయలేడీపై తాజాగా మరో కేసు కూడా నమోదు కావడంతో.. పోలీసులు అమెతో పాటు అమెకు పెళ్లి విషయంలో అమె కుటుంబసభ్యులుగా నటిస్తున్న వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లను వెతుకుతూ, యువకులను పరిచయం చేసుకోవడం, పెళ్లి చేసుకుందామని చెప్పడం, ఆపై వారు నమ్మారని తెలుసుకున్నాక, కష్టాల కథలు చెప్పి, దొరికినంత కాజేసి ముఖం చాటేయడం ఆమె వృత్తి. తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన బాలమురుగన్ అనే బంగారు వ్యాపారి, ఎంబీఏ చేసిన తరువాత వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఓ మాట్రిమోనియల్‌ వెబ్‌ సైట్‌ లో పేరు, వివరాలు నమోదు చేసుకున్నాడు. అతనికి సేలం జిల్లా ఆట్టయంపట్టికి చెందిన 25 ఏళ్ల యువతి అదే వెబ్ సైట్ లో పరిచయం అయింది. పరిచయాన్ని సన్నిహిత సంబంధంగా మార్చుకుని, పెళ్లి చేసుకుందామని నమ్మించింది.

ఆపై తన కుటుంబ కష్టాలు చెప్పింది, అవసరానికి ఆదుకోవాలని వాపోతూ, రూ. 23 లక్షల వరకూ నొక్కేసింది. ఆపై క్రమంగా అతన్ని దూరం పెట్టింది. అనుమానం వచ్చిన బాలమురుగన్, యువతి ఇంటికి వెళ్లి, ఆమె సెల్‌ ఫోన్‌ ను పరిశీలించగా చాలామంది యువకులతో అత్యంత సన్నిహితంగా తానున్న ఫొటోలు, అసభ్యంగా తీసుకున్న సెల్ఫీలు చూశాడు. వాటితో పాటు ప్రేమ ముసుగేసుకుని ఆమె చేస్తున్న అసభ్య చాటింగులు, ఎస్‌ఎంఎస్‌లు చదివి, తాను అడ్డంగా మోసపోయినట్టు గ్రహించాడు. దీంతో బాలమురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణ ప్రారంభించగా, ఆమె వెంటనే ఇంటి నుంచి పారిపోయింది. పోలీసుల విచారణలో ఆ యువతి కోయంబత్తూరు, చెన్నై, మధురై తదితర ప్రాంతాలకు చెందిన వారిని ఇదే తరహాలో 17 మందిని నమ్మించి, మోసగించిందని తేల్చారు. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles