Modi takes oath as the PM of India ప్రధానిగా నరేంద్రమోడీ పట్టాభిషేకం.. కేంద్రమంత్రులు

Narendra modi takes oath becomes pm narendra modi again

modi swearing in ceremony live,modi,swearing in ceremony 2019,swearing in ceremony time,pm swearing in ceremony,modi swearing in ceremony time,swearing ceremony meaning,pm modi swearing in ceremony live,narendra modi live,modi shapath,bimstec, narendra modi, Prime minister, oath, rashtrapati bhavan, President Ram Nath Kovind, Ministers

Over 8,000 guests attended the oath taking ceremony of PM Narendra Modi. Apart from the leaders of BIMSTEC countries, including Bangladesh, Myanmar, Sri Lanka, Thailand, Nepal and Bhutan, heads of the states from Kyrgyzstan and Mauritius graced the ceremony touted as the biggest ever event that to be held at Rashtrapati Bhavan.

ప్రధానిగా నరేంద్రమోడీ పట్టాభిషేకం.. కేంద్రమంత్రులు

Posted: 05/30/2019 09:03 PM IST
Narendra modi takes oath becomes pm narendra modi again

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రధానిగా వరుసగా రెండో పర్యాయం ప్రమాణస్వీకారం చేసిన పట్టాభిషేక కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నరేంద్ర మోదీతో.. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్‌.. మోదీకి అభినందనలు తెలిపారు. ఈ వేడుకకు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, నేపాల్, భూటాన్ (బిమ్‌స్టిక్‌) దేశాధినేతలతో పాటు పలువురు దేశ, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపి అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, గులాంనబీ అజాద్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కుమారస్వామి, దేవేంద్ర ఫడణవీస్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, యోగి ఆదిత్యనాథ్‌, పళనిస్వామి, ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ దంపతులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ దంపతులు, రతన్‌ టాటాతో పాటు సుమారు ఎనిమిది వేలమంది అతిథులు హాజరయ్యారు.

ఆ తరువాత మొత్తం 58 మంది కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం చేస్తున్నారు. వీరిలో క్యాబినెట్ మంత్రులుగా 25మంది, స్వతంత్ర హోదాలో తొమ్మిది మంది, కేంద్ర సహాయ మంత్రులుగా 25మంది ప్రమాణస్వీకారం చేశారు.

కేంద్రమంత్రి జాబితా:

1. రాజ్‌నాథ్‌సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
2. అమిత్‌ షా (గుజరాత్‌)
3. నితిన్‌ జైరాం గడ్కరీ (మహారాష్ట్ర)
4. డీవీ సదానంద గౌడ (కర్ణాటక)
5. నిర్మలా సీతారామన్‌ (తమిళనాడు)
6. రాంవిలాస్‌ పాసవాన్‌ (బిహార్‌)
7. నరేంద్ర సింగ్‌ తోమర్‌ ( మధ్యప్రదేశ్‌)
8. రవిశంకర్‌ ప్రసాద్‌ (బిహార్‌)
9. హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ (శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ- పంజాబ్‌)
10. థావర్‌ చంద్‌గహ్లోత్‌ (మధ్యప్రదేశ్‌)
11. ఎస్‌.జయశంకర్‌ (తమిళనాడు)
12. రమేశ్‌ పోఖ్రియాల్‌ (ఉత్తరాఖండ్‌)
13. అర్జున్‌ ముండా (ఝార్ఖండ్‌)
14. స్మృతి జుబిన్‌ ఇరానీ (దిల్లీ)
15. హర్షవర్ధన్‌ (దిల్లీ)
16. ప్రకాశ్‌ జావదేకర్‌ (మహారాష్ట్ర)
17. పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర- ముంబయి)
18. ధర్మేంద్ర ప్రధాన్‌ ( ఒడిశా)
19. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (ఉత్తర్‌ప్రదేశ్‌)
20. ప్రహ్లాద్‌ జోషి (కర్ణాటక)
21. మహేంద్రనాథ్‌ పాండే (ఉత్తర్‌ప్రదేశ్‌ -వారణాసి)
22. అరవింద్‌ సావంత్‌ (మహారాష్ట్ర - ముంబయి)
23. గిరిరాజ్‌ సింగ్‌ (బిహార్‌)
24. గజేంద్రసింగ్‌ షెకావత్‌ (రాజస్థాన్‌)
25. సంతోష్‌ గాంగ్వర్‌ ( ఉత్తర్‌ప్రదేశ్‌)
26. రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ (హరియాణా)
27. శ్రీపాద్‌ యశోనాయక్‌ (గోవా)
28. జితేంద్ర సింగ్‌ (జమ్ము కశ్మీర్‌)
29. కిరణ్‌ రిజిజు (అరుణాచల్‌ ప్రదేశ్‌)
30. ప్రహ్లాద్‌ పటేల్‌ (మధ్యప్రదేశ్‌)
31. రాజ్‌కుమార్‌ సింగ్‌ (బిహార్‌)
32. హర్‌దీప్‌సింగ్‌ పూరీ (పంజాబ్‌)
33. మనసుఖ్‌ మాండవీయ (గుజరాత్‌)
34. ఫగ్గన్‌సింగ్‌ కులస్థే (మధ్యప్రదేశ్‌)
35. అశ్వినీకుమార్‌ చౌబే (బిహార్‌)
36. అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ (రాజస్థాన్‌)
37. వీకే సింగ్‌ (పంజాబ్‌)
38. కృషన్‌పాల్‌ గుర్జార్‌ (హరియాణా)
39. రావ్‌సాహెబ్‌ ధాన్వే (మహారాష్ట్ర)
40. జి.కిషన్‌ రెడ్డి (తెలంగాణ)
41. పురుషోత్తం రూపాలా (గుజరాత్‌)
42. రాందాస్‌ అథవాలే (మహారాష్ట్ర)
43. సాధ్వి నిరంజన్‌ జ్యోతి (ఉత్తర్‌ప్రదేశ్‌)
44. బాబుల్‌ సుప్రియో (పశ్చిమ బెంగాల్‌)
45. సంజీవ్‌ బాల్యన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
46. సంజయ్‌ శామ్‌రావ్‌ (మహారాష్ట్ర)
47. అనురాగ్ ఠాకూర్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)
48. అంగడి సురేష్‌ చిన్నబసప్ప  (కర్ణాటక)
49. నిత్యానంద్‌ రాయ్‌ (బిహార్‌)
50. రతన్‌లాల్‌ కటారియా (హరియాణా)
51. వి. మురళీధరన్‌ (కేరళ)
52. రేణుకా సింగ్‌ సరుతా (ఛత్తీస్‌గఢ్‌)
53. సోం ప్రకాశ్‌ (పంజాబ్‌)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  Prime minister  oath  rashtrapati bhavan  President Ram Nath Kovind  Ministers  

Other Articles