Tamil actress and 14 young girls get murder threats నటికి చంపేస్తామని బెదిరింపు కాల్స్..

Tamil actress and 14 young girls get murder threats

Meera Mithun, Model, Actress Meera Mithun, '8 Thottakkal' Kalaiyarasan's character's wife, Suriya's 'Thaana Serndha Koottam', Vignesh Shivan. Ajith Shiva, Joe Michel, Praveen, Malarkodi, 14 young girls, TN Police, Crime

Actress Meera Mithun a model and several beauty pageant titles winner has lodged a complaint against Ajith Shiva, Joe Michel, Praveen and Malarkodi have meted out murder threats against her and 14 other young girls.

చంపేస్తామని బెదిరింపు కాల్స్.. పోలీసులకు నటి పిర్యాదు

Posted: 05/31/2019 12:44 PM IST
Tamil actress and 14 young girls get murder threats

మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి మోడలింగ్ రంగంలో అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది మీరా మిధున్. ఆ వెంటనే చిత్రరంగంలో ప్రవేశించినా.. అనుకున్నంత అవకాశాలు దక్కడ తన జీవితంలో ఎదగాలంటే జోడు గుర్రాలపై స్వారీ చేయాలని భావించింది. దీంతో అటు మోడలింగ్ ఇటు సినీ కెరీర్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అమె.. అకస్మాత్తుగా పోలీసులను ఆశ్రయించారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. తనను హత్య చేస్తామని దుండగలు ఫోన్ లో బెదిరిస్తున్నారని మీరా మిథున్ పోలీసులకు తెలిపారు.

చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేసిన అమె.. తానే సొంతంగా అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో, 'మిస్‌ తమిళ్‌ దివా' పేరిట పోటీలను ప్రకటించానని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది. '8 తోట్టాగళ్', 'తానా సేర్నద కూట్టం' తదితర తమిళ చిత్రాల్లో నటించిన కథానాయిక.. మిస్‌ సౌత్‌ ఇండియన్‌ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే తాను నిర్వహించ తలపెట్టిన అందాల పోటీలకు పోలీసుల భద్రత కల్పించాలని అమె మరో దరఖాస్తు కూడా కమీషనర్ కు అందజేసినట్లు సమాచారం.

ఈ పోటీలను తాను రానున్న సొమవారం నిర్వహించాలని భావించానని,  ఈక్రమంలో తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయయని అమె తెలిపారు. అయితే తాను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని.. ఈ తరుణంలో పోటీలో పాల్గొనే యువతులకు బెదిరింపులు వెళ్లాయని, దీంతో వారు భయాందోళనకు గురయ్యారని.. అందుకనే తాను పోలీసులను అశ్రయించినట్లు అమె తెలిపారు. గత వారం రోజులుగా బెదిరింపు ఫాన్ కాల్స్ తీవ్రత పెరిగిందని, చంపేస్తామంటున్నారని ఆమె వాపోయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meera Mithun  Model  Actress  '8 Thottakkal'  'Thaana Serndha Koottam'  Kollywood  Police  Crime  

Other Articles