Two held for trafficking a two-headed snake రెండు తలల పాముకు విముక్తి.. ఇద్దరి అరెస్టు

Indian two headed snake rescued by police from gang

Two headed snake, double headed Snake,snake rescue, Rs.2.50 crore,two Persons,arrest,sand Boa, Two Headed snake, mira-bhayander, Thane, Palghat, Mumbai, Maharashtra, Crime Crime

Two men were arrested by the Thane local crime branch for allegedly looking for buyers for two red sand boas valued at around Rs 2.5 crore.

రెండు తలల పాముకు విముక్తి.. ఇద్దరి అరెస్టు

Posted: 05/30/2019 05:29 PM IST
Indian two headed snake rescued by police from gang

అరుదుగా లభించే రెండు తలల పామును విక్రయాలు అధికారులు ఎంతగా నిఘా పెట్టినా కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను  మహారాష్ట్రలోని ఠాణెలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారిద్దరి వద్ద వునన రెండు తలల పాము ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం పామును స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై నవఘర్ పోలీసు అధికారి రామ్ బాల్‌సింగ్ మీడియాకు వివరాలను వెల్లడించారు.

అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు యువకుల వద్ద నుంచి రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నామని దాని ఖరీదు మార్కెట్‌లో రూ. 2 కోట్ల 45 లక్షలకు పైబడి వుండవచ్చని తెలిపారు. నిందితులను ముంబైకి చెందిన వాజిద్ హుస్సేన్ మొహమ్మద్ యూసుఫ్ ఖురేషీ (47), శంభూ అచ్ఛేలాల్ పాశ్వాన్(39)లుగా పోలీసులు గుర్తించి వారిని జైలుకు తరలించారు. కాగా పాము వారు వారే స్వయంగా పట్టుకున్నారా? లేదా వేరే ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారా అన్న వివరాలను తమ దర్యాప్తులో తెలుసుకోనున్నామన్నారు.

అయితే ఇతరుల వద్ద నుంచి కొనుగోలు చేసి మరొకరికి విక్రయిస్తున్నారా? అసలు దీనికి కారణమేంటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్రమార్కులు చేస్తున్న ఈ స్మగ్లింగ్ లతో రెండు తలల పాము అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. ఇవి వున్న చోట సిరిసంపదలకు నిలయంగా మారుతుందున్న వార్త కూడా ఇవి అంతరించిపోవడానికి కారణమని తెలుస్తోంది. వీటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పర్యవారణ వేత్తలు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ పామును ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీకి వాడుతున్న క్రమంలో వీటిని అమ్మకాలు తరచు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sand Boa  Two Headed snake  mira-bhayander  Thane  Palghat  Mumbai  Maharashtra  Crime  

Other Articles