YS Jagan assures corruption free transparent government అవినీతిరహిత పారదర్శక పాలనకు సీఎం వైఎస్ జగన్ హామీ

Cm ys jaganmohan reddy assures corruption free transparent government

YS JaganMohan Reddy sworn in as CM of AP, YS JaganMohan Reddy Andhra Pradesh CM, YS Jagan, Governor ESL Narasimhan, Andhra Pradesh Chief Minister, YS JaganMohan Reddy, Chief Minister, YSRCP, Assembly elections, lok-sabha-elections-2019, andhra pradesh, politics

YS JaganMohan Reddy takes oath as Chief Minister of Andhra Pradesh and addresses the crowd saying that he will implement the navratna schemes, which was promised by him during the padayatra. His First Signature was on oldage pension scheme which hiked from Rs 1000 to 2250.

అవినీతిరహిత పారదర్శక పాలనకు సీఎం వైఎస్ జగన్ హామీ

Posted: 05/30/2019 03:01 PM IST
Cm ys jaganmohan reddy assures corruption free transparent government

పదేళ్ల తన రాజకీయ ప్రస్థానమంతా ప్రతిపక్షంలోనే కొనసాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇటీవల జరిగిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయదుంధఃభి మ్రోగించిన జగన్ ఏడాది పాటు తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని, ప్రజల సమస్యలను విన్నానని, వారికి అప్పుతే తాను వున్నాను అని భరోసా ఇచ్చారు. ఇక తాజాగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో.. తాను ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రకారం నవరత్నాల హామీలను నెరవేర్చుతానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లడానికి విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామని తెలిపారు.

అందుకోసం ఆగస్టు 15 నాటికి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పిన జగన్.. కేవలం రెండు నెలలు అగితే నిరుద్యోగ యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో నిరుద్యోగ యువతను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామనీ, ఇందుకోసం ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమిస్తామన్నారు. ఇందుకు గ్రామాల్లో విద్యావంతులైన నిరుద్యోగ యువతను ఎంపిక చేస్తామని జగన్ తెలిపారు. వీరికి గౌరవవేతనంగా రూ.5,000 చెల్లిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో అక్రమాలకు, అవినీతికి అలవాటుపడిన వ్యవస్థను రూపుమాపేందుకు లంచాలు లేని సమాజాన్ని నిర్మించడమే తన ధ్యేయమని అన్నారు. తమకు సంక్షేమ పథకాల ఫలాలు అందకుంటే, లంచాలు, వేధింపులు జరిగితే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ను కూడా ఆగస్టు 15న ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కాల్ సెంటర్ తన కార్యాలయంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు. మెరుగైన ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ పిల్లలకు గ్రామ వాలంటీర్లుగా అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఎవరికైనా పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ కావాలన్నా గ్రామ వాలెంటీర్ల ద్వారానే ఆ పనులను చేసిపెడతారని అన్నారు. ఎవరికి ఏం కావాలన్నా గ్రామ సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకోవాలని జగన్ సూచించారు. దరఖాస్తు చేసిన 72 గంటల్లో పని అయిపోతుందని హామీ ఇస్తున్నానన్నారు. ‘ఏపీలో స్వచ్ఛమైన, అవినీతి లేని, వివక్ష లేని పాలన అందిస్తాననీ, అవినీతి లేకుండా ప్రక్షాళన చేస్తానని ఏపీలోని 6 కోట్ల ఆంధ్రులకు హామీ ఇస్తున్నా’ అని చెప్పారు. అవినీతి కాంట్రాక్టులను రద్దు చేస్తామని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles