Will not spare on false allegations in Yellow media: YS Jagan ‘‘ఎల్లో మీడియాకు సీఎం జగన్ అల్టిమేటం.. కోర్టులకీడుస్తాను..’’

Will not spare on false allegations in yellow media ys jagan

YS JaganMohan Reddy sworn in as CM of AP, YS Jagan Ultimatum to Media, YS Jagan ultimatuem to Yellow media, YS Jagan on False allegations, YS JaganMohan Reddy Andhra Pradesh CM, YS Jagan, Governor ESL Narasimhan, Andhra Pradesh Chief Minister, YS JaganMohan Reddy, Chief Minister, YSRCP, Assembly elections, lok-sabha-elections-2019, andhra pradesh, politics

YS JaganMohan Reddy addresses the crowd after taking oath as Chief Minister of Andhra Pradesh, saying that his government will not spare any one who furnishes wrong details and make false allegations on his government

‘‘ఎల్లో మీడియాకు సీఎం జగన్ అల్టిమేటం.. కోర్టులకీడుస్తాను..’’

Posted: 05/30/2019 03:53 PM IST
Will not spare on false allegations in yellow media ys jagan

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన, అవినీతి రహిత, వివక్ష లేని పాలన అందిస్తాననీ, అక్రమాలకు తావులేకుండా ప్రక్షాళన చేస్తానని ఏపీలోని 6 కోట్ల ఆంధ్రులకు హామీ ఇస్తున్నా’ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విజయవాడలోని సభావేదికకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులను ఉద్దేశించిన ప్రసగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తొలి రోజునే ఎల్లో మీడియాగా ముద్రపడిన టీడీపీ పత్రికలకు అల్టిమేటం జారీ చేశారు. తప్పుడు కథనాలను, వాస్తవం లేని, సత్యదూరమైన, నిరాధారమైన అరోపణలు ప్రచురించినా.. లేక ప్రసారం చేసినా తగ్గిన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందని అరోపించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇక తమ హాయంలో అలాంటి వాటికి అస్కారం లేకుండా హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమీషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు త్వరలోనే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తానని తెలిపారు. ఓ హైకోర్టు జడ్జీని జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు కేటాయించాల్సిందిగా కోరతామని వెల్లడించారు. దీంతో ‘ఏ కాంట్రాక్టు అయినా టెండర్లకు పోకముందే కమిషన్ ముందుకు పంపిస్తాం. న్యాయమూర్తి చేసే సూచనలు, మార్పులను తు.చ తప్పకుండా పాటిస్తాం. ఆ తర్వాతే కాంట్రాక్టులను పిలుస్తాం. అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని సీఎం జగన్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో మీడియా ఉండటం నిజంగా ప్రజల ఖర్మ అని ముఖ్యమంత్రి విమర్శించారు. ‘ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ5ను చూసినా.. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగతావారెవరూ ఇంపుగా కనిపించరు. మిగిలినవాళ్లను ఎలా దించాలన్న రీతిలోనే వీరి రాతలు ఉంటాయి. ఈ సంస్థలన్నింటికి నేను ఒక్కటే చెబుతున్నా. మీరు పారదర్శకమైన టెండర్లపై తప్పుడు కథనాలు రాస్తే పరువునష్టం దావా దాఖలు చేస్తాం. వీరిని శిక్షించాల్సిందిగా హైకోర్టును గట్టిగా కోరతాం. ఆరు నెలల నుంచి సంవత్సరం నాకు గడువు ఇవ్వండి. అవినీతి అన్నది ఏపీలో లేకుండా చేస్తానని జగన్ ప్రజలకు మాట ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles