పదేళ్ల తన రాజకీయ ప్రస్థానమంతా ప్రతిపక్షంలోనే కొనసాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇటీవల జరిగిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయదుంధఃభి మ్రోగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్.. తన తొలిసంతకాన్ని వృద్వాప్య ఫించన్ల పెంపు దస్త్రంపైనే పెట్టారు. రాష్ట్రంలోని వృద్దులకు పించన్లు సక్రమంగా అందడం లేదని.. ఈ విషయాన్ని తన పాదయాత్ర వారితో మాట్లాడి తెలుసుకున్నానని, అప్పుడే వారికి నెలకు రెండు వేల రూపాయల పింఛను ఇస్తానని చెప్పానని హామి ఇచ్చానని చెప్పారు.
ఇచ్చిన మాటకు కట్టబడి.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిఫల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తన నవరత్నాలలోని వృద్దాప్య పెంచన్ల సూత్రాన్ని అమలు పర్చేందుకు వృద్దులకు జూన్ నెల ప్రారంభం నుంచి ప్రతీ నెల రూ.2250 రూపాయల ఫించను ఇస్తామని చెప్పారు. 60 ఏళ్లు నిండిన ప్రతి అవ్వకు, ప్రతీ తాతకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చనున్నట్లు సీఎం తెలిపారు. రాజకీయాలకు ఎలాంటి తావు లేకుండా.. అర్హులైన పేద వృద్దులైన ప్రతీ ఒక్కరికీ ఈ పథాకాన్ని అందిస్తామిన అన్నారు.
పార్టీలకు సంబంధం లేకుండా తన ప్రభుత్వ హాయాంలో పథకాలు అర్హులైన లభ్దిదారులను వెతుక్కుంటూ వెళ్తాయని చెప్పారు. ఇక రూ.2250 నుంచి ప్రారంభమైన ఈ ఫించను ప్రతీ ఏడాది రూ.250 మేర పెరుగుతుందని చెప్పారు. ఇక ఐదేళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ తాతకు, అవ్వకు మూడు వేల రూపాయల ఫించన్ అందుతుందని చెప్పారు. తాను ప్రకటించిన మానిఫెస్టోను ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీతలా పవిత్రగంధంలా భావిస్తానని వైఎస్ జగన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more