Cyclone Fani to impact northcoastal Andhra ఉత్తరాంధ్రపై ‘ఫణి’ పంజా.. మరికొన్ని గంటల్లో క్లారిటీ..

Imd issues storm fani warning to northern andhra emergency preventive measures

IMD, Andhra cyclone alert, TN cyclone alert, cyclone alert tn, IMD cyclone alert, Andhra storm, tn storm, puducherry storm, pondicherry weather, pondicherry storm alert, Andhra Pradesh, Politics

India Meteorological Department (IMD) has issued cyclonic storm Fani warning to the Northern Andhra part, IMD officials to locate exact place where Fani is crossing by tommarrow evening.

తిత్లీ గాయాలు మానకముందే.. ఉత్తరాంధ్రపై ‘ఫణి’ పంజా..

Posted: 04/29/2019 10:54 AM IST
Imd issues storm fani warning to northern andhra emergency preventive measures

ఉత్తరాంధ్రపై ఇటీవలే తన ప్రభావం చూపిన తిత్లీ తుఫాను పెను బీభత్సం సృషించి.. అపారనష్టాన్ని కలిగించిన విషాధాల నుంచి ఇంకా ఆ ప్రాంతవాసులు కోలుకోకముందే మే నెలలో మరో తుఫాను తన పంజా విసరనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలాన్ని పుంజుకుని పెను తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మే 1న తీవ్ర పెను తుఫానుగా మారనున్న ఫణి.. 2 లేదా 3వ తేదీల్లో ఉత్తరాంధ్రకు చేరువగా ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

అయితే, ఈ పెను తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయాన్ని మాత్రం అప్పుడే అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ విషయంలో మరికొన్ని గంటల తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రీలంకలోని ట్రింకోమలీకి 630 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 910 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1090 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణించే సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

కోస్తాంధ్ర తీరం వెంబడి ఇది ప్రయాణించే అవకాశాలు ఉన్నప్పటికీ అంధ్రప్రదేశ్ లో ఇది తీరం దాటుతుందా.? లేక అధికారులు ముందుగా అంచనా వేసినట్లు దిశమార్చుకుంటుందా అన్ని విషయమై కూడా మరికోన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం వుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావడానికి మరికొన్ని గంటలు పడుతుందని అంచనా వేస్తున్న వాతావరణ శాఖ అధికారులు.. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ముప్పు తప్పినట్టుగా భావించలేమని హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను తీరం దాటే వేళ, గంటకు 195 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని అంటున్నారు.

తుపాను దిశను మార్చుకుంటే, వర్షాలకు బదులు వేడిగాలులు వీస్తాయని, మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. 30వ తేదీ నుంచి సూపర్‌ సైక్లోన్‌ (ఎక్‌ స్ట్రీమ్‌ లీ సివియర్‌ సైక్లోనిక్‌ స్టార్మ్‌) ప్రభావం భారత్ పై కనిపిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles